ముంబైలో త్వరలో ప్రారంభం కానున్న భారతదేశపు మొట్టమొదటి యాపిల్ స్టోర్
ఆపిల్ భారతదేశంలో తన మొదటి రిటైల్ స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది, దీనిని ఆపిల్ BKC అంటారు. యాపిల్ కొంతకాలంగా భారతదేశంలో తన సొంత రిటైల్ స్టోర్‌ను తెరవాలనే చర్చలు జరుపుతోంది. ముంబైలోని Jio వరల్డ్ డ్రైవ్ మాల్‌లో మొదటి రిటైల్ స్టోర్ ను ఆపిల్ ప్రకటించింది. ఆపిల్ BKC స్టోర్ లో సందర్శకులకు అందుబాటులో ఉండే అనేక Apple ఉత్పత్తులు, సేవలతో కలిపి decals రంగుల వివరణలు ఉంటాయి. స్టోర్ కోసం క్రియేటివ్‌లో క్లాసిక్ ఆపిల్ గ్రీటింగ్ "హలో ముంబై"తో ప్రయాణిస్తున్న వారికి ప్రత్యేకమైన స్వాగతం పలుకుతుంది. కొత్త స్టోర్ ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి, ఆపిల్ అభిమానులు కొత్త ఆపిల్ BKC వాల్‌పేపర్‌ని డౌన్‌లోడ్ చేసుకుని చెక్ చేయచ్చు
మొదటి స్టోర్ లాంచ్ కోసం ఆపిల్ Musicలో కొత్త ప్లే లిస్ట్ ను రూపొందించింది
భారతదేశంలో దాని మొదటి స్టోర్ లాంచ్ కోసం ఆపిల్ Musicలో కొత్త ప్లే లిస్ట్ ను రూపొందించింది. ఈ స్టోర్ ఏప్రిల్‌లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది, ఆ తర్వాత ఆపిల్ మరో రిటైల్ స్టోర్ ను న్యూఢిల్లీలో తెరవాలనే ఆలోచనలో ఉంది. యాపిల్ ఈమధ్యే భారత మార్కెట్‌లో మరో రికార్డు ఆదాయాన్ని రాబట్టినట్లు ప్రకటించింది. 2022 నాల్గవ త్రైమాసికంలో (Q4) భారతదేశంలో 2 మిలియన్ ఐఫోన్‌లను అమ్మి 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఐఫోన్‌ల భారత మార్కెట్ వాటా 2022కి 5.5%కి చేరుకుంది, ఇది 11% వృద్ధిని అందుకుంది.