LOADING...
Sarvam AI: ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న భారత్‌ ఏఐ.. సర్వమ్ విజన్ అద్భుతం
ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న భారత్‌ ఏఐ.. సర్వమ్ విజన్ అద్భుతం

Sarvam AI: ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న భారత్‌ ఏఐ.. సర్వమ్ విజన్ అద్భుతం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐ మోడళ్ల విషయానికి వస్తే ఇప్పటివరకు ప్రపంచ దృష్టి మొత్తం అమెరికా, చైనా మీదే ఉండేది. భారత్‌లో ప్రతిభ, మార్కెట్ ఉన్నప్పటికీ కోర్ ఏఐ అభివృద్ధిలో మన దేశం పెద్దగా కనిపించలేదు. కానీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ సర్వమ్ ఏఐ (Sarvam AI) ఆ పరిస్థితిని మార్చేస్తోంది. 'సావరిన్ ఏఐ'(sovereign AI)లక్ష్యంగా భారత్‌లోనే పునాది స్థాయి ఏఐ మోడళ్లను రూపొందిస్తున్న ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన సర్వమ్ విజన్, బుల్బుల్ టూల్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి.

వివరాలు 

ర్వమ్ పనితీరును మెచ్చుకుంటున్న టెక్ వర్గాలు

ముఖ్యంగా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) విభాగంలో సర్వమ్ విజన్, చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఆంత్రోపిక్ క్లాడ్ లాంటి పెద్ద ఏఐ మోడళ్లను కొన్ని బెంచ్‌మార్క్‌లలో వెనక్కి నెట్టేసిందని సంస్థ చెబుతోంది. olmOCR-Benchలో ఇది 84.3 శాతం ఖచ్చితత్వాన్ని సాధించి, జెమినీ 3 ప్రో, డీప్‌సీక్ OCR v2 కంటే మెరుగైన స్కోర్ సాధించగా, చాట్‌జీపీటీ చాలా వెనుకబడిందని వెల్లడైంది. అలాగే వాస్తవ ప్రపంచ డాక్యుమెంట్లను ఏఐ ఎలా చదివి అర్థం చేసుకుంటుందో పరీక్షించే OmniDocBench v1.5లో 93.28 శాతం స్కోర్‌తో క్లిష్టమైన లేఅవుట్లు, సాంకేతిక పట్టికలు, గణిత ఫార్ములాల్లోనూ అద్భుత ఫలితాలు ఇచ్చింది. ఒకప్పుడు ఇండిక్ భాషలపై ఎక్కువ దృష్టి పెట్టడాన్ని ప్రశ్నించిన టెక్ వర్గాలు ఇప్పుడు సర్వమ్ పనితీరును మెచ్చుకుంటున్నాయి.

వివరాలు 

త్వరలో 22 భాషలు 

టెక్ వ్యాఖ్యాత దీడీ దాస్ కూడా తమ అంచనాలు తప్పాయని అంగీకరిస్తూ,ఇండియన్ భాషల కోసం సర్వమ్ OCR, స్పీచ్ మోడళ్లకు మార్కెట్‌లో పెద్ద లోటును ఇవి భర్తీ చేస్తున్నాయని చెప్పారు. ఇదే సమయంలో సర్వమ్ విడుదల చేసిన బుల్బుల్ V3 అనే టెక్స్ట్-టు-స్పీచ్ ఏఐ మోడల్ కూడా ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం 11 భారతీయ భాషల్లో 35కిపైగా వాయిస్‌లకు మద్దతు ఇస్తున్న ఈ టూల్‌ను త్వరలో 22 భాషల వరకు విస్తరించాలన్న యోచనలో కంపెనీ ఉంది. ఇప్పటికే ఇండిక్ అవసరాల కోసం బుల్బుల్‌ను వినియోగిస్తున్నామని, విదేశీ టూల్స్‌తో పోలిస్తే ఇది మెరుగ్గా, తక్కువ ఖర్చుతో ఉందని వినియోగదారులు చెబుతున్నారు. మొత్తంగా భారత్ నుంచి వచ్చిన ఈ ఏఐ టూల్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

Advertisement