LOADING...
Astrophotographer : భారత ఆస్ట్రోఫోటోగ్రాఫర్ అద్భుతం.. ట్రైయాంగులమ్ గెలాక్సీ ఫోటో వైరల్
భారత ఆస్ట్రోఫోటోగ్రాఫర్ అద్భుతం.. ట్రైయాంగులమ్ గెలాక్సీ ఫోటో వైరల్

Astrophotographer : భారత ఆస్ట్రోఫోటోగ్రాఫర్ అద్భుతం.. ట్రైయాంగులమ్ గెలాక్సీ ఫోటో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2026
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనలో చాలామంది రాత్రివేళ ఆకాశంలో కొన్ని నక్షత్రాలను చూసి ఆనందిస్తుంటారు. కానీ భారతీయ ఆస్ట్రోఫోటోగ్రాఫర్ రమేష్ భద్రి మాత్రం తన కెమెరాతో ఏకంగా భూమికి సుమారు 2.7 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీని బంధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్ గ్రామం నుంచి ఆయన చిత్రీకరించిన ట్రయాంగులం గెలాక్సీ (Messier 33 లేదా M33) ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ చిత్రంలో స్పైరల్ ఆకారంలో ఉన్న గెలాక్సీ అద్భుతమైన స్పష్టతతో కనిపిస్తోంది. "మన గెలాక్సీకి పొరుగున ఉన్న M33ను ఎలా చిత్రీకరించానో ఇదే ఆ కథ" అంటూ ఆయన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.

వివరాలు

ఉత్తరాఖండ్‌ గ్రామం నుంచి చిత్రీకరణ 

అలాగే ఈ గెలాక్సీని బంధించే ప్రక్రియను కూడా వివరించారు. "దూరంలోని ఖగోళ యుద్ధాలను కెమెరాలో బంధించడం మాకు ఇష్టం. కానీ ఇది మాత్రం మనకు చాలా దగ్గర సంబంధమున్న విషయం. మన మిల్కీ వే గెలాక్సీ, ట్రైయాంగులమ్ గెలాక్సీ మధ్య జరిగే భారీ ఢీకొనుకు కౌంట్‌డౌన్ ఇప్పటికే ప్రారంభమైందని రమేష్ పేర్కొన్నారు. సుమారు గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఈ గెలాక్సీ మన వైపు దూసుకొస్తోందని, అలాంటి ఖగోళ దృశ్యాన్ని తాను ఉత్తరాఖండ్‌లోని తన గ్రామం నుంచి చిత్రీకరించినట్లు తెలిపారు.

వివరాలు

1764 ఆగస్టులో మొదటగా అధికార గుర్తింపు

NASA తెలిపిన వివరాల ప్రకారం, ఈ గెలాక్సీని ఇతరులు ఇంతకుముందే చూసి ఉండొచ్చేమో కానీ, 1764 ఆగస్టులో దీనిని మొదటగా అధికారికంగా గుర్తించి నమోదు చేసిన వ్యక్తి ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మెస్సియర్. భూమికి సుమారు 3 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న M33, మన గెలాక్సీకి సమీపంలో ఉన్న స్పైరల్ గెలాక్సీలలో ఒకటిగా గుర్తించారు. నగరాల కాంతి కాలుష్యం లేని ప్రాంతాల్లో, చంద్రకాంతి లేని స్వచ్ఛమైన రాత్రుల్లో ఈ గెలాక్సీని కంటితో కూడా చూడవచ్చని నాసా పేర్కొంది. అయితే దీని స్పైరల్ భుజాలు, గులాబీ రంగు నక్షత్ర నిర్మాణ ప్రాంతాలు, ధూళి పొరలను స్పష్టంగా ఫోటో తీయాలంటే చీకటి ఆకాశం, ప్రత్యేక ట్రాకింగ్ పరికరాలు, దీర్ఘకాల ఎక్స్‌పోజర్ అవసరమని తెలిపింది.

Advertisement

వివరాలు

నన

రమేష్ భద్రి మాట్లాడుతూ, "Redcat 51 టెలిస్కోప్, ZWO 533MC Pro కెమెరాతో పాటు L-Pro ఫిల్టర్ ఉపయోగించి కాంతి కాలుష్యాన్ని తగ్గించాను. సుమారు 2.7 మిలియన్ సంవత్సరాలుగా ప్రయాణిస్తున్న ఫోటాన్‌లను కెమెరాలో బంధించగలిగానని వివరించారు. బిలియన్ల సంవత్సరాల తర్వాత మన రాత్రి ఆకాశం పూర్తిగా మారిపోతుంది. మనం అప్పటికి ఉండకపోవచ్చు. కానీ భవిష్యత్తులో మనకు దగ్గరయ్యే ఖగోళ పొరుగువాని నిజమైన రూపాన్ని నేను ఈరోజు బంధించాను. ఇందులో ఎలాంటి డిజిటల్ ఎడిటింగ్, సింథటిక్ పిక్సెల్స్ లేవు. ఇది అంతరిక్షం యొక్క అందమైన, భయానక వాస్తవం" అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు

మరో ప్రపంచం కనపడింది

ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతమైన స్పందనను తెచ్చుకుంది. "నిజంగా అద్భుతం" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, "మాకు మరో ప్రపంచాన్ని చూపించినందుకు ధన్యవాదాలని మరొకరు పేర్కొన్నారు. జస్ట్ అమేజింగ్... చూస్తుంటే మైండ్ బ్లోయింగ్‌గా ఉందంటూ మరో నెటిజన్ స్పందించాడు.

Advertisement