Page Loader
Railone app: అందుబాటులోకి  రైల్వే సూపర్ యాప్‌ 'రైల్‌వన్‌'..ఇక అన్ని రైల్వే సేవలు ఒకే చోట 
అందుబాటులోకి  రైల్వే సూపర్ యాప్‌ 'రైల్‌వన్‌'..ఇక అన్ని రైల్వే సేవలు ఒకే చోట

Railone app: అందుబాటులోకి  రైల్వే సూపర్ యాప్‌ 'రైల్‌వన్‌'..ఇక అన్ని రైల్వే సేవలు ఒకే చోట 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైల్వేకు సంబంధించిన విభిన్న సేవలను ఒకే వేదికపై సమీకరిస్తూ రూపొందించిన సూపర్ యాప్‌ - "రైల్‌వన్‌" తాజాగా అందుబాటులోకి వచ్చింది. మొదటిగా ఈ యాప్‌ను "స్వరైల్‌" (SwaRail) అనే పేరుతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన రైల్వే శాఖ, ఇప్పుడు ఈ సేవను "రైల్‌వన్‌" పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులు ఇప్పుడు ఒక్కచోటే రైల్వేకి సంబంధించిన ఎన్నో అవసరాల్ని తీర్చుకోవచ్చు. ముఖ్యంగా, రిజర్వేషన్ టికెట్లు, అన్‌రిజర్వ్డ్ టికెట్లు, ప్లాట్‌ఫామ్‌ టికెట్లు, రైళ్ల ఎంక్వైరీ, PNR స్టేటస్, జర్నీ ప్లానింగ్, రైల్ మదద్, ఫుడ్ ఆన్ ట్రైన్ వంటి అనేక సేవలను ఒకే యాప్‌లో పొందే అవకాశాన్ని ఈ సూపర్ యాప్‌ కల్పిస్తోంది.

వివరాలు 

భవిష్యత్‌లో ఈ యాప్‌లో మరిన్ని సేవలు

ప్రస్తుతం రైల్వేకు సంబంధించిన ఈ సేవలన్నీ వేర్వేరు యాప్‌ల రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సేవకు ప్రత్యేకంగా ఓ యాప్‌ ఉండే పరిస్థితిలో,వాటన్నిటినీ కలిపి ఒకే ప్లాట్‌ఫామ్‌లో సమీకరించడం ఈ రైల్‌వన్‌ యాప్‌ ప్రధాన లక్ష్యం. గత కొన్ని నెలలుగా దీన్ని పరిక్షించి,చివరకు జనవరి 1న దీన్ని అధికారికంగా విడుదల చేశారు. ఈ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేసింది సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS). వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లాంచ్ చేశారు. ఇకపై ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ యాప్‌లో మరిన్ని సేవలను జోడించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.