Loading...
Instagram: కంటెంట్ క్రియేటర్లపై ఇన్‌స్టాగ్రామ్ వరాల జల్లు.. రూ.4 కోట్ల వరకు చెల్లింపులు
కంటెంట్ క్రియేటర్లపై ఇన్‌స్టాగ్రామ్ వరాల జల్లు.. రూ.4కోట్ల వరకు చెల్లింపులు

Instagram: కంటెంట్ క్రియేటర్లపై ఇన్‌స్టాగ్రామ్ వరాల జల్లు.. రూ.4 కోట్ల వరకు చెల్లింపులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లకు భారీ మొత్తంలో డబ్బులు ఆఫర్ చేస్తోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను పోస్ట్ చేసేలా వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొంతమంది క్రియేటర్లకు ఏకంగా 5 లక్షల డాలర్ల (సుమారు రూ.4 కోట్లకు పైగా) వరకు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ తన వీడియో ఫార్మాట్లలో ఇటీవల తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ఐజీటీవీ (IGTV)ను కొత్త పేరుతో 'ఫీచర్స్' (Features)గా మళ్లీ ప్రారంభించింది.

వివరాలు 

'ఫీచర్స్'లో 90 నిమిషాల నిడివి ఉన్న వీడియోలు

ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా తీసుకొచ్చిన 'ఫీచర్స్' ద్వారా యూజర్లు హారిజాంటల్, వైడ్‌స్క్రీన్ వీడియోలను చూడొచ్చు.

వీటి నిడివి గరిష్ఠంగా 90 నిమిషాల వరకు ఉండవచ్చు. అంటే దాదాపు ఓ సినిమా నిడివితో కూడిన వీడియోలను కూడా ఇందులో పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వంటి చిన్న నిడివి ఉన్న వీడియోలదే ప్రధాన స్థానం.

టిక్‌టాక్‌కు పోటీగా రీల్స్‌ను తీసుకొచ్చిన తర్వాత ఈ తరహా కంటెంట్ బాగా ప్రాచుర్యం పొందింది.

అయితే ఇప్పుడు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలపైనా దృష్టి పెట్టడం ద్వారా తన వీడియో ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరించాలని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తోంది.

వివరాలు 

యూట్యూబ్‌లో పెట్టిన వీడియోలనే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేయొచ్చు

క్రియేటర్లతో చేసుకుంటున్న ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలను మెటా సంస్థ వెల్లడించలేదు.

అయితే 'ఫీచర్స్' కోసం కొంతమంది క్రియేటర్లకు నేరుగా డబ్బులు చెల్లిస్తున్నట్లు ధ్రువీకరించింది.

తద్వారా తమ ప్లాట్‌ఫామ్‌పై లాంగ్ ఫార్మాట్ వీడియోల సంఖ్యను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఒప్పందాల్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. క్రియేటర్లు తమ వీడియోలను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే పోస్ట్ చేయాలనే నిబంధన లేదు.

యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే లాంగ్ వీడియోలను అదే రోజు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేసుకోవచ్చు.

అంటే ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ ప్రచురించకుండా క్రియేటర్లను ఇన్‌స్టాగ్రామ్ పరిమితం చేయడం లేదు.

ADVERTISEMENT

వివరాలు 

గతంలోనూ షార్ట్ వీడియోల కోసం క్రియేటర్లకు చెల్లింపులు

క్రియేటర్లకు డబ్బులు చెల్లించి తమ యాప్స్‌లో ఎక్కువ కంటెంట్ వచ్చేలా చేయడం మెటాకు ఇదే తొలిసారి కాదు.

గత ఏడాది కూడా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో షార్ట్ వీడియోలు పోస్ట్ చేసిన క్రియేటర్లకు వేల డాలర్ల వరకు చెల్లించింది.

అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు వచ్చే ఆదరణ, వాటి పనితీరును బట్టి క్రియేటర్లకు బోనస్‌లు ఇచ్చే పలు కార్యక్రమాలను కూడా పరీక్షించింది.

ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ వీడియోల కోసం భారీ మొత్తంలో చెల్లింపులు చేస్తుండటం విశేషం.

ADVERTISEMENT

వివరాలు 

మిగతా కంటెంట్ క్రియేటర్ల పరిస్థితి ఏంటి?

ఇన్‌స్టాగ్రామ్ కొంతమంది క్రియేటర్లకు నేరుగా డబ్బులు చెల్లిస్తున్న నేపథ్యంలో మిగతా కంటెంట్ క్రియేటర్ల ఆదాయంపై చర్చ మొదలైంది.

యూట్యూబ్‌కు ఉన్న ప్రధాన ఆకర్షణల్లో దాని పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (Partner Program) ఒకటి.

దీని ద్వారా అర్హత కలిగిన క్రియేటర్లకు వారి వీడియోలపై వచ్చే ప్రకటనల ఆదాయంలో కొంత వాటా చెల్లిస్తారు.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇలాంటి ఆదాయ మార్గాలు ఉంటాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొస్సేరి స్పందించారు.

లాంగ్ ఫార్మాట్ వీడియోలు రూపొందించే క్రియేటర్లకు ఆదాయం వచ్చేలా చేసేందుకు పలు మార్గాలను పరిశీలిస్తున్నామని ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు.

ADVERTISEMENT