WhatsApp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్స్ మాట్లాడుతూ స్క్రీన్ షేరింగ్!
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వారందరికి ఓ గుడ్ న్యూస్ అందింది. ఇకపై వినియోగదారులు వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో తమ స్క్రీన్ ను ఇతరులతో పంచుకోవచ్చు. తమ ఫోన్ లోని కంటెంట్ ను ఇతరులు వీక్షించేలా ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఆఫీస్ మీటింగ్స్, ఇతర విషయాలకు ఈ టూల్ చాలా ఉపయోగకరంగా ఉండనుంది. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వాట్సాప్‌లో వీడియో కాల్ సమయంలో స్క్రీన్ ను షేర్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.
32 మంది గరిష్టంగా ఈ వీడియో కాల్ పాల్గొనవచ్చు
వాట్సాప్‌లో ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవాలంటే వీడియో కాల్ సమయంలో షేర్ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత యాప్ షేరు చేసుకోవాలా లేదా స్క్రీన్ మొత్తాన్ని షేర్ చేసుకోవాలో అనే అప్షన్ కనపడుతుంది. ఈ వీడియో కాల్‌లో గరిష్టంగా 32 మంది పాల్గొనవచ్చు. రానున్న రోజుల్లో ఎక్కువ మంది వీడియో కాల్‌లో పాల్గొనేలా వాట్సాప్ ఈ పరిమితిని పెంచే అవకాశం ఉంటుంది. గతంలో స్క్రీన్-షేరింగ్ ఆప్షన్ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు యూజర్ల అందరికి అందుబాటులోకి రానుంది