
ISRO: కొండల్లో, లోయల్లో.. టవర్ లేకుండానే ఇంటర్నెట్.. CMS-02 ఉపగ్రహం రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని కొండల్లో, లోయల్లో ఉన్నవారు ఇక 'సిగ్నల్స్ లేవు' అని బాధపడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ పూర్తి సామర్థ్యంతో, హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పని చేస్తుంది. దీని కోసం ఏదో నెట్‌వర్క్ కంపెనీకి ప్రకటన అవసరం లేదు. వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్ పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికా తయారైన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్దమవుతోంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి అక్టోబర్ రెండో వారంలో మరో భారీ రాకెట్ ప్రయోగం జరగనుంది.
Details
CMS-02 ఉపగ్రహం ఈ నెలాఖరులో భారత్‌కు చేరనుంది
ఈ ప్రయత్నంలో ఇస్రో శాస్త్రవేత్తల స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన CMS-02 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని LVM-3M Mark-5 రాకెట్ ద్వారా నింగిలోకి పంపించనున్నట్లు తెలిపారు. రాకెట్ అనుసంథానం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా 6,500 కిలోల బరువు గల బ్లాక్-2 బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగికి పంపనున్నారు. ఈ ఉపగ్రహాన్ని అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన AST Space Mobile రూపొందించింది. CMS-02 ఉపగ్రహం ఈ నెలాఖరులో భారత్‌కు చేరనుంది. ఈ ఉపగ్రహం ద్వారా భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు భూమిపై టవర్‌లపై ఆధారపడకుండా నేరుగా కాల్స్ చేయగలుగుతారు. అలాగే, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా మరింత సులభమవుతుంది. CMS-02 ఉపగ్రహం కొండల్లో, అడివి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అందించగలదు.
Details
కమ్యూనికేషన్ రంగం మరింత ఎదిగే అవకాశం
ఇస్రో ఇప్పటికే శ్రీహరికోట నుంచి అనేక కమ్యూనికేషన్ ఉపగ్రహాలను విజయవంతంగా నింగికి పంపింది. ఈ ప్రయోగం కమ్యూనికేషన్ రంగాన్ని మరింత అభివృద్ధి పరుస్తుందనే నిపుణుల విశ్లేషణ. CMS-02 ఉపగ్రహాన్ని అక్టోబర్ 15 నుంచి 19 మధ్య LVM-03-M5 రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు రాకెట్ అనుసంధాన పనులు షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ భవనంలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైతే, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతంగా అందించడానికి CMS-02 ఉపగ్రహం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, LVM-3M Mark-5 రాకెట్ నిజానికి అక్టోబర్ మాసంలో ఏ రోజున ప్రయోగించబడుతుందనే తుది తేదీని ఇస్రో శాస్త్రవేత్తలు త్వరలో ఖరారు చేయనున్నారు.