LOADING...
Avi Loeb: సౌరవ్యవస్థలో కలకలం రేపుతున్న 3I/ATLAS తోకచుక్క.. వింత ప్రవర్తనతో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీ
వింత ప్రవర్తనతో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీ

Avi Loeb: సౌరవ్యవస్థలో కలకలం రేపుతున్న 3I/ATLAS తోకచుక్క.. వింత ప్రవర్తనతో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన సౌరవ్యవస్థలో గమనించబడిన ఓ అసాధారణ గ్రహాంతర తోకచుక్క శాస్త్రవేత్తలను తీవ్రంగా ఆశ్చర్యంలోకి దింపుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఏవీ లోబ్ ఈ తోకచుక్క సాధారణ ప్రకృతికి చెందని, భూమి లాంటి గ్రహాలపై జీవాన్ని ప్రసారం చేయడానికి ఒక ఉన్నత నాగరికత ఉద్దేశపూర్వకంగా పంపిన 'జీవ బీజ నౌక'(Seed Ship)కావచ్చని సంచలన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ 3I/ATLAS అనే తోకచుక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా,తోకచుక్కల తోక సూర్యుడికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ దీని తోక సూర్యుడి వైపు ఉంటూ,రసాయన నిర్మాణం,ప్రయాణ విధానం సాధారణాలతో భిన్నంగా ఉండడం వల్ల శాస్త్రవేత్తల్లో గందరగోళం రేకెత్తింది. ఈఅసాధారణ లక్షణాల వల్లే దీనిలో ఏదైనా అధునాతన టెక్నాలజీ ఉన్నట్లు అనుమానాలు ఏర్పడుతున్నాయి.

వివరాలు 

భూమిపైకి గ్రహాంతర జీవం ఎప్పుడో చేరి ఉండొచ్చన్న శాస్త్రవేత్త లోబ్ 

"విశ్వంలో మనకంటే ముందు ఎన్నో నాగరికతలు పుట్టి ఉండొచ్చు.వాటిలో ఏదైనా ఒక 'అంతరిక్ష తోటమాలి' (Interstellar Gardener) ఉద్దేశపూర్వకంగా భూమిపై జీవానికి బీజం వేసి ఉండొచ్చు"అని ఏవీ లోబ్ వ్యాఖ్యానించారు. కోట్లాది సంవత్సరాలుగా ఈ తరహా గ్రహాంతర వస్తువులు భూమిని చేరుతూ ఉంటాయని,వాటిలో కొన్ని సూక్ష్మజీవులను భద్రంగా కాపాడుతూ,భూమికి జీవాన్ని తీసుకురాగలవచ్చని ఆయన తన బ్లాగ్‌లో వివరించారు. లోబ్ వాదన ప్రకారం,మన సూర్యకాంతిక కంటే బిలియన్ల సంవత్సరాల ముందే గెలాక్సీలో అనేక నక్షత్రాలు ఏర్పడి ఉండగా,ఇతర నాగరికతలకు అభివృద్ధి చెందడానికి పెద్ద అవకాశం దొరికింది. అయితే,ఈ అభిప్రాయం సాహసోపేతంగా ఉండటంతో, శాస్త్రవేత్తలు వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినప్పటికీ, 3I/ATLAS తోకచుక్క ప్రవర్తన విశ్వం గురించి కొత్త చర్చలకు మళ్లీ నాంది కాస్తే.

Advertisement