iOS 27: ఫ్లాషీ ఫీచర్లకు బ్రేక్.. iOS 27లో AI అప్‌గ్రేడ్స్‌కి పెద్ద పీట
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ రాబోయే పెద్ద అప్‌డేట్ iOS 27లో మెరుపులా ఆకట్టుకునే కొత్త ఫీచర్లకన్నా పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగుదలలపై ఎక్కువ దృష్టిపెడుతోందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ వెల్లడించారు. ఇటీవల వచ్చిన iOS 26లో లిక్విడ్ గ్లాస్ డిజైన్ మార్పులు, అలాగే సరిగ్గా తయారుకాని AI ఫీచర్లు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు కంపెనీ "స్నో లియోపార్డ్" తరహాలో—అవసరంలేని అంశాలు తొలగించడం, బగ్‌లు సరిచేయడం, సిస్టమ్‌ను మరింత స్థిరంగా, వేగంగా మార్చే పనికి ఇంజినీరింగ్ టీమ్‌లను దించినట్టు సమాచారం.
వివరాలు
అనేక యాప్స్‌లో అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ
ఇదే సమయంలో AI సామర్థ్యాల పెంపుపైన కూడా ఆపిల్ ఫోకస్ పెంచింది. AI వెబ్ సెర్చ్ టూల్, అప్డేట్ చేసిన ఆపిల్ ఇంటెలిజెన్స్, ఇంకా అనేక యాప్స్‌లో అడ్వాన్స్డ్ AI టెక్నాలజీని కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. 2024 నుంచి ఆపిల్ టీజ్ చేస్తున్న స్మార్టర్, మరింత పర్సనలైజ్డ్ Siri—AI ఆధారంగా పని చేసే ఈ కొత్త వెర్షన్—iOS 27కి ముందే రావచ్చు. గుర్మన్ అంచనా ప్రకారం, ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో రానున్న iOS 26.4 అప్‌డేట్‌లోనే కనిపించే అవకాశం ఉంది.