Page Loader
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000 తగ్గింపు ఆఫర్‌తో లభిస్తున్న ఐఫోన్ 14
ఈ ఆఫర్ ఐఫోన్ 14 రెడ్ మోడల్ కు మాత్రమే వర్తిస్తుంది

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000 తగ్గింపు ఆఫర్‌తో లభిస్తున్న ఐఫోన్ 14

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 31, 2023
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద తగ్గింపుతో దాదాపు ఐఫోన్ 13 ధరలో అందుబాటులో ఉంది. తాజా తగ్గింపు ఆఫర్‌లతో, రెండింటి మధ్య కేవలం రూ.3,000 గ్యాప్ మాత్రమే ఉంది. ఫ్లిప్‌కార్ట్ 2022 ఐఫోన్‌పై రూ.15,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో అసలు ధర రూ.79,999 నుండి రూ.68,999కు లభిస్తుంది. ఈ ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.11,000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తుంది. అయితే, చెల్లింపు కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, ఐఫోన్ 14ని ధర రూ.64,999కు తగ్గుతుంది. అయితే, ఈ ఆఫర్ ఐఫోన్ 14 రెడ్ మోడల్ మాత్రమే, ఇతర రంగు వేరియంట్‌లు వేర్వేరు ధరలకు అమ్ముడవుతున్నాయి. ఈ ఆఫర్ 128GB స్టోరేజ్ మోడల్‌కు వర్తిస్తుంది.

ఫోన్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ లేనివారు ఐఫోన్ 13ని కొనుక్కోవడమే మంచిది

ఐఫోన్ 13 భారతదేశంలో రూ. 61,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఆపిల్ తన ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అదే ఐఫోన్‌ను రూ.69,999కి అమ్ముతుంది. రూ. 3,000 ఆదా చేయాలనుకునే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ లేనివారు ఐఫోన్ 13ని కొనుక్కోవడమే మంచిది. ఐఫోన్ 14, 13 స్పెసిఫికేషన్‌ల పరంగా ఒకేలా ఉన్నప్పటికీ, ఐఫోన్ 14 ఉన్నవారికి వారి ప్రాంతంలో నెట్‌వర్క్ లేనప్పుడు అత్యవసర సమయంలో ఎవరికైనా హెచ్చరికలను పంపడానికి ప్రత్యేకమైన శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. అయితే, ఈ ఫీచర్ భారతదేశంలో అందుబాటులో లేదు కాబట్టి, ఐఫోన్ 13ని కొనుగోలు చేయడం మంచిది.