LOADING...
iPhone 17: ఐఫోన్ 17 లాంచ్ కు ముందే అన్ని అమ్ముడుపోతాయా?.. అప్‌గ్రేడ్‌ కావాలనుకుంటున్న 70 శాతం ఐఫోన్‌ యూజర్లు 
అప్‌గ్రేడ్‌ కావాలనుకుంటున్న 70 శాతం ఐఫోన్‌ యూజర్లు

iPhone 17: ఐఫోన్ 17 లాంచ్ కు ముందే అన్ని అమ్ముడుపోతాయా?.. అప్‌గ్రేడ్‌ కావాలనుకుంటున్న 70 శాతం ఐఫోన్‌ యూజర్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త ఐఫోన్‌ సిరీస్‌ మార్కెట్లోకి రాకముందే మంచి డిమాండ్‌ కనిపిస్తోంది. సెప్టెంబర్‌ 9న ఐఫోన్‌ 17 సిరీస్‌ను ఆవిష్కరించకముందే, అన్ని మోడళ్లూ అమ్ముడైపోవచ్చని ఒక సర్వే పేర్కొంది. అమెరికాలోని ఐఫోన్‌ యూజర్లలో 70 శాతం మంది ఐఫోన్‌ 17 సిరీస్‌ కోసం అప్‌గ్రేడ్‌ కావాలనుకుంటున్నారని సర్వే వెల్లడించింది.

లాంచ్‌

సెప్టెంబర్‌ 17న లాంచ్‌ ఈవెంట్‌ 

సెప్టెంబర్‌ 17న ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరగనుంది. దీనికి ముందుగా స్మార్ట్‌ఫోన్‌ ధరల సరిపోలింపు సైట్‌ 'సెల్‌సెల్‌' ఆగస్టులో సర్వే నిర్వహించింది. రెండు వేల మంది పైగా ఐఫోన్‌ యూజర్లతో ఈ సర్వే జరిగింది. 68.3 శాతం మంది ఐఫోన్‌ 17 కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. గమనార్హం ఏమిటంటే, గత ఏడాది ఐఫోన్‌ 16 విడుదలకు ముందు 61.9 శాతం మంది అప్‌గ్రేడ్‌ అవ్వాలని ఉత్సాహం చూపించగా, ఈసారి డిమాండ్‌ 1.4 శాతం పెరిగినట్లు తెలిసింది.

ప్రో, ప్రో మాక్స్‌ మోడల్స్‌

ప్రో, ప్రో మాక్స్‌ మోడల్స్‌కు యువత మొగ్గు 

ఐఫోన్‌ 17 కోసం అప్‌గ్రేడ్‌ కావాలనుకునేవారిలో ఎక్కువ మంది ప్రో, ప్రో మాక్స్‌ మోడల్స్‌ పై ఆసక్తి చూపుతున్నారు. ఈ మోడల్స్‌ కోసం 38.1 శాతం మంది యూజర్లు ఆసక్తి వ్యక్తం చేశారు. సాధారణ ఐఫోన్‌ 17ను 16.7 శాతం మంది ఎంచుకున్నారు. కొత్త అల్ట్రా-థిన్‌ ఐఫోన్‌ 17 ఎయిర్‌ కోసం 13.5 శాతం మంది ఆసక్తి చూపించారు. ఫోల్డబుల్‌ ఐఫోన్‌ కోసం కేవలం 3.3 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపారు.

బ్యాటరీ లైఫ్‌

బ్యాటరీ లైఫ్‌ ప్రధాన కారణం 

ఐఫోన్‌ 17లో అప్‌గ్రేడ్‌ అవ్వడానికి యూజర్లు ఎందుకు సిద్ధమవుతున్నారు అని అడిగిన ప్రశ్నకు, 53 శాతం మంది ప్రధాన కారణంగా బ్యాటరీ లైఫ్‌ను చెప్పారు. 36.2 శాతం మంది కొత్త డిజైన్‌ మరియు ఫీచర్ల కోసం, 34.3 శాతం మంది డిస్‌ప్లే టెక్నాలజీ కోసం, 28.1 శాతం మంది కెమెరా సామర్ధ్యాల కోసం అప్‌గ్రేడ్‌ కావాలనుకున్నారు. ఏఐ ఫీచర్ల కోసం 7 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపారు.

ఫోల్డబుల్‌ ఐఫోన్‌

ఫోల్డబుల్‌ ఐఫోన్‌లో పోటీ 

ఫోల్డబుల్‌ ఐఫోన్‌ విషయంలో ఆపిల్‌ ఇతర కంపెనీలతో కఠిన పోటీ ఎదుర్కొంటుంది. 2026లోపు ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మార్కెట్‌కి రాకపోతే, 20 శాతం మంది యూజర్లు శాంసంగ్ వైపు, 10 శాతం మంది గూగుల్‌ పిక్సెల్‌ వైపు మళ్లే అవకాశముందని సర్వే పేర్కొంది. అయితే, 70 శాతం మంది యూజర్లు ఆపిల్‌ బ్రాండ్‌పై నమ్మకాన్ని కొనసాగించారనే విషయం స్పష్టమైంది.

డిజైన్‌, ఏఐ ఫీచర్లు 

డిజైన్‌, ఏఐ ఫీచర్లపై విభిన్న అభిప్రాయాలు 

కొత్త అల్ట్రాథిన్‌ మోడల్‌ లాంచ్‌ అవ్వటంతో, 47.5 శాతం మంది యూజర్లు కొత్త డిజైన్‌ పై ఆసక్తి చూపారు. స్లిమ్‌ మోడల్‌ కోసం బ్యాటరీ త్యాగం చేయడానికి కూడా సిద్ధమని వారు చెప్పారు. 30 శాతం మంది సన్నని మోడళ్లపై ఆసక్తి చూపలేదు. ఏఐ ఫీచర్లపై మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి: 44 శాతం మంది ఏఐ ఫీచర్లు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు, కానీ మూడో వంతు మంది ఆసక్తి చూపలేదు. ఐఫోన్‌ ఏఐ రంగంలో ముందుంది అని 44 శాతం మంది, శాంసంగ్/గూగుల్‌ను 6.6 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు.

ధర

ధర ప్రధాన అడ్డంకి 

అప్‌గ్రేడ్‌ కోసం ధర ప్రధాన సమస్యగా మారింది. కొత్త ఐఫోన్‌ సిరీస్‌ కోసం 69 శాతం మంది ధర కారణంగా ఆలోచిస్తున్నారని తెలిపారు. 71 శాతం మంది ప్రస్తుత ఫోన్‌తో సంతృప్తిగా ఉన్నారు. ధర పెరిగితే, 36.8 శాతం మంది అప్‌గ్రేడ్‌ని వాయిదా వేస్తారని, మూడొంతుల మంది మాత్రమే ధర ఎంత పెరిగినా ఐఫోన్‌ కొనుగోలు చేస్తారని చెప్పారు.