Apple iPhone Duo: అమెరికాలో ఆపిల్ ఐఫోన్ డ్యుయో రూ.లక్ష తక్కువ.. భారత్‌కు ఎన్ని తెచ్చుకోవచ్చంటే? కస్టమ్స్ రూల్స్ ఏంటంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ మోడళ్లు భారత్‌లో విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో సంస్థ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్ 'ఐఫోన్ డ్యుయో'ను కూడా పరిచయం చేసింది. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లు, విక్రయాలు అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. అయితే అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఈ మోడళ్ల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది. దీంతో అమెరికా నుంచి ఐఫోన్ కొనుగోలు చేసి భారత్‌కు తీసుకురావాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కస్టమ్స్ నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. భారత్‌లో ఐఫోన్ డ్యుయో ప్రారంభ ధర రూ.2,99,900గా ఉంది. ఐఫోన్ 18 ప్రో ధర రూ.1,64,900 నుంచి, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర రూ.1,79,900 నుంచి మొదలవుతోంది.
వివరాలు
భారత్‌కు ఎన్ని ఐఫోన్లు డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు?
అమెరికాలో వీటి ప్రారంభ ధరలు వరుసగా 1,999 డాలర్లు, 1,199 డాలర్లు, 1,299 డాలర్లుగా ఉన్నాయి.
కరెన్సీ మార్పిడి లెక్కల ప్రకారం.. ఐఫోన్ డ్యుయో ధరలో భారత్, అమెరికా మధ్య సుమారు రూ.లక్ష వ్యత్యాసం ఉంది.
దీంతో అమెరికా నుంచి స్నేహితులు, బంధువుల ద్వారా ఆపిల్ పరికరాలను తెప్పించుకోవాలని కొందరు భావిస్తుంటారు.
అమెరికా నుంచి భారత్‌కు ఎన్ని ఆపిల్ ఐఫోన్లు తీసుకురావాలనే విషయంలో నిర్దిష్ట సంఖ్యా పరిమితి లేదు.
అయితే కస్టమ్స్ సుంకం లేకుండా తీసుకురావడానికి విలువకు సంబంధించిన పరిమితి ఉంటుంది.
క్లియర్‌ట్యాక్స్‌కు చెందిన చాంద్ని ఆనందన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే ఉపయోగిస్తున్న ఐఫోన్ వంటి వ్యక్తిగత వస్తువులను కొన్ని నిబంధనల ప్రకారం డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు.
వివరాలు
భారత్‌కు ఎన్ని ఐఫోన్లు డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు?
అయితే కొత్తగా కొనుగోలు చేసిన,సీల్ చేసిన పరికరం విలువ రూ.75,000కు మించితే..ఆ అదనపు విలువపై కస్టమ్స్ సుంకం వర్తించవచ్చు.
ఐఫోన్ డ్యుయో ధర ఈ పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉండటంతో.. వర్తించే నిబంధనల ప్రకారం రూ.75,000మినహాయింపు పరిమితిని మించిన మొత్తంపై కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి రావచ్చు.
వేద్ జైన్ అండ్ అసోసియేట్స్ భాగస్వామి అంకిత్ జైన్ తెలిపిన ప్రకారం.. పన్నును కలుపుకున్నా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఐఫోన్ డ్యుయో ధర సుమారు రూ.2.57లక్షల వరకు ఉండొచ్చు.
ఇది భారత్‌లోని రూ.3లక్షల రిటైల్ ధర కంటే తక్కువే. అయితే కస్టమ్స్ అధికారులు సాధారణంగా ఒక్క అన్‌బాక్స్ చేసిన, ప్రయాణికుడు ఉపయోగిస్తున్న ఫోన్‌ను'ఉపయోగించిన వ్యక్తిగత వస్తువులు' మినహాయింపు కింద పరిగణించే అవకాశం ఉంటుంది.
వివరాలు
అమ్మకానికి తీసుకువస్తే నిబంధనలు వేరు
ప్రయాణికుడు కేవలం ఒక అన్‌బాక్స్ చేసిన ఫోన్‌ను తను ఉపయోగిస్తున్నట్లుగా తీసుకువస్తే.. కొన్ని పరిస్థితుల్లో కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.
అయితే ఒకేసారి పలు కొత్త ఐఫోన్లను తీసుకురావడం వాణిజ్య ఉద్దేశాన్ని సూచించవచ్చని చాంద్ని ఆనందన్ తెలిపారు.
అలా ఉంటే వ్యక్తిగత వినియోగం పేరుతో లభించే మినహాయింపు వర్తించకపోవచ్చు.
ఫోన్ విలువ ఉచిత పరిమితిని మించినప్పుడు లేదా వాటిని విక్రయించేందుకు దిగుమతి చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించినప్పుడు సుంకం వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
అమ్మకానికి తీసుకువస్తే నిబంధనలు వేరు
ఆమె ప్రకారం.. ముందుగా ఫోన్ విలువపై 15శాతం BCD విధిస్తారు.దీనిపై BCD మొత్తంలో 10శాతం సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జ్ వసూలు చేస్తారు.
ఆ తర్వాత ఫోన్ విలువ,BCD,సర్‌ఛార్జ్ కలిపిన మొత్తంపై 18శాతంIGST చెల్లించాలి. మొత్తంగా ఈ మూడు పన్నులు కలిపితే ఫోన్ విలువపై సుమారు 37.5శాతం సుంకం పడుతుంది.
ఇవన్నీ కలిపితే ఫోన్ విలువపై సుమారు 37.5శాతం సుంకం పడుతుంది.
ఉదాహరణకు..ఒక్కో ఐఫోన్ ధర రూ.1.91లక్షలు చొప్పున మూడు ఫోన్లు తీసుకువస్తే, వాటి మొత్తం విలువ రూ.5,73,000 అవుతుంది.
ఇందులో రూ.75,000 డ్యూటీ రహిత పరిమితిని మినహాయిస్తే.. సుంకం విధించే విలువ రూ.4,98,000గా ఉంటుంది.
దీనిపై 37.5శాతం లెక్కిస్తే రూ.1,86,750కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది.ఇది ఇచ్చిన అంచనాల ఆధారంగా చేసిన ఉదాహరణ మాత్రమే.
వివరాలు
వ్యక్తిగత వినియోగం పేరుతో ఐఫోన్ తెస్తే కస్టమ్స్ డ్యూటీ ఉండదా?
ఐఫోన్ వ్యక్తిగత వినియోగం కోసమేనని చెప్పడం ద్వారా మాత్రమే కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు లభించదని ఎస్‌కేవీ లా ఆఫీసెస్ సీనియర్ అసోసియేట్ తేజస్వి దుడేజా తెలిపారు.
కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 79 ప్రకారం.. డ్యూటీ రహిత క్లియరెన్స్ బ్యాగేజీ నిబంధనల్లో పేర్కొన్న షరతులకు లోబడి ఉంటుంది.
అలాగే సెక్షన్ 77 ప్రకారం ప్రయాణికుడు తన బ్యాగేజీలోని వస్తువులను ప్రకటించాల్సి ఉంటుంది.
బ్యాగేజీ నిబంధనల్లోని రూల్ 2(1)(g) ప్రకారం వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతి చేసే వస్తువులు వ్యక్తిగత వస్తువుల పరిధిలోకి రావని దుడేజా వివరించారు.
ఒకేసారి పలు కొత్త లేదా ఖరీదైన ఐఫోన్లను తీసుకువస్తే.. అవి వ్యక్తిగత వినియోగానికా? విక్రయించడానికా? అనే విషయాన్ని కస్టమ్స్ అధికారులు పరిశీలించవచ్చు.
వివరాలు
వ్యక్తిగత వినియోగం పేరుతో ఐఫోన్ తెస్తే కస్టమ్స్ డ్యూటీ ఉండదా?
అవసరాన్ని బట్టి అధికారులు పాస్‌పోర్ట్, ప్రయాణ పత్రాలు, కొనుగోలు బిల్లు, రసీదు, వస్తువు విలువకు సంబంధించిన ఆధారాలు, ఫోన్ వివరాలను అడగవచ్చు.
అందువల్ల 'వ్యక్తిగత వినియోగం' అనేది పరిస్థితుల ఆధారంగా నిర్ణయించే అంశమే తప్ప.. కస్టమ్స్ సుంకం నుంచి స్వతంత్రంగా మినహాయింపు ఇచ్చే హక్కు కాదని దుడేజా స్పష్టం చేశారు.