iQOO Neo 10R:ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లోకి iQOO Neo 10R
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు iQOO తన కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది.
స్టన్నింగ్ డిజైన్, శక్తివంతమైన ఫీచర్లతో మిడ్-రేంజ్ బడ్జెట్‌లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.
త్వరలో iQOO భారత మార్కెట్లో iQOO Neo 10R ను విడుదల చేయనుంది.
అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ ఫోన్‌లో 6400mAh బ్యాటరీ, 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చని అంచనా.
వివరాలు
12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో..
ఈ ఫోన్ ప్రధాన కెమెరా 50MP Sony LYT-600 సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
దీనికి తోడు 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించనున్నారు.
ఈ డివైస్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లభించనుందని సమాచారం.
అంతేకాకుండా, ఈ ఫోన్ Raging Blue అనే ఆకర్షణీయమైన కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో ఈ హ్యాండ్‌సెట్ శక్తివంతమైన పనితీరును అందించనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ఇది 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండేలా డిజైన్ చేయబడింది.
వివరాలు
అమెజాన్ ద్వారా ఫోన్ కొనుగోలు
ఫోన్ Android 15 ఆధారంగా Funtouch OS 15 పై రన్ అవుతుంది. అదనంగా, ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో వస్తుంది, అంటే డస్ట్ & వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
iQOO ప్రకటించిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 30,000 ధరలో విడుదలయ్యే అవకాశముంది.