Page Loader
భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7
HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్ లతో తక్షణ తగ్గింపు

భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 21, 2023
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

iQOO తాజా Z-సిరీస్ మోడల్, iQOO Z7 ఇప్పుడు భారతదేశంలో రూ. 18,999కు అందుబాటులో ఉంది. ఇందులో 90Hz AMOLED స్క్రీన్, 64MP ప్రధాన కెమెరా, డైమెన్సిటీ 920 చిప్‌సెట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ ఉంది. 5G స్మార్ట్‌ఫోన్ గేమింగ్-ఆధారిత ఫీచర్స్ ను అందిస్తుంది. iQOO Z7 6GB/128GB కాన్ఫిగరేషన్‌ ధర రూ.18,999, 8GB/128GB కాన్ఫిగరేషన్‌ ధర రూ.19,999. మార్కెట్లో ఈ ఫోన్ ఈమధ్య ప్రారంభమైన POCO X5తో పోటీపడుతుంది, ఇది ఈరోజు నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంది. iQOO HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే కొనుగోలుదారులకు రూ.1,500 తక్షణ తగ్గింపు ఉంటుంది.

ఫోన్

పసిఫిక్ నైట్, నార్వే బ్లూ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది

ఇది పసిఫిక్ నైట్, నార్వే బ్లూ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. iQOO Z7 OISతో 64MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో సెన్సార్, LED ఫ్లాష్‌ ఉంటుంది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP కెమెరా అందిస్తుంది. iQOO Z7 డైమెన్సిటీ 920 చిప్‌సెట్, గరిష్టంగా 8GB RAM, 128GB స్టోరేజ్ ఉంటుంది. దీనికి రెండు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, మూడు సంవత్సరాల ప్రైవసీ అప్డేట్లు లభిస్తాయి. ఇందులో 4,500mAh బ్యాటరీ 44W ఫాస్ట్-ఛారింగ్ సపోర్ట్ తో వస్తుంది. 5G ఫోన్‌లో డ్యూయల్ సిమ్‌లు, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.