భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్
iQOO భారతదేశంలో iQOO Neo 7 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.ఇందులో 120Hz AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్, 64MP ప్రైమరీ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. iQOO తాజా మిడిల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌తో వచ్చిన మొదటి ఫోన్. ఇది గత సంవత్సరం డిసెంబర్‌లో చైనాలో ప్రారంభమైన iQoo Neo 7 SE రీబ్రాండెడ్ వెర్షన్. ఈ ఫోన్ పూర్తి కవరేజ్ 3D కూలింగ్ సిస్టమ్ తో పాటు మోషన్ కంట్రోల్‌తో ఆకట్టుకునే గేమింగ్-ఫోకస్డ్ ఫీచర్‌లతో వస్తుంది. దీనికి ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ ఉంది.
iQOO Neo 7కు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుంది
iQOO Neo 7, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ సపోర్ట్ తో, 12GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో వస్తుంది. దీనికి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. కనెక్టివిటీ కోసం 5G, NFC, GPS, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, టైప్-సి పోర్ట్‌ను అందిస్తుంది. iQOO Neo 7 8GB/128GB వేరియంట్ ధర రూ.30,000, 12GB/256GB వేరియంట్ ధర రూ. 34,000. హ్యాండ్‌సెట్ ఈరోజు నుండి అమెజాన్ తో పాటు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది ఫ్రాస్ట్ బ్లూ, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ షేడ్స్‌లో లభిస్తుంది