Page Loader
WhatsApp: మీ వాట్సాప్ కాల్‌ల్లో లొకేషన్ ట్రాక్ అవుతుందా? అయితే ఈ సెట్టింగ్స్ అవసరం
మీ వాట్సాప్ కాల్‌ల్లో లొకేషన్ ట్రాక్ అవుతుందా? అయితే ఈ సెట్టింగ్స్ అవసరం

WhatsApp: మీ వాట్సాప్ కాల్‌ల్లో లొకేషన్ ట్రాక్ అవుతుందా? అయితే ఈ సెట్టింగ్స్ అవసరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2024
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు, మీరు కాల్ చేస్తున్నప్పుడు లేదా రిసీవ్ చేసుకున్నప్పుడు, అవతలి వ్యక్తి మీ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. అంటే వారు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోగలరు. అయితే వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ఒక ప్రత్యేక ఆప్షన్ 'ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్' ను ఆన్ చేసుకుంటే, మీ IP అడ్రస్ లొకేషన్‌ను అవతలివాళ్లు ట్రాక్ చేయలేరు. ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఫీచర్ ప్రయోజనాలు ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే, మీ ప్రైవసీని మరింత పెంచుకోవచ్చు. దీంతో, సైబర్ నేరగాళ్లు లేదా ఇతరులు మీ లొకేషన్‌ను ట్రాక్ చేయలేరు. ఇది ముఖ్యంగా డిజిటల్ మోసాలు, హ్యాకింగ్ వంటి ప్రమాదాలను నివారించడంలో సాయపడుతుంది.

Details

 ఈ సెట్టింగ్స్‌ను ఎలా మార్చాలి? 

1. మీ ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేయండి. 2. స్క్రీన్ పైన రైట్ సైడ్ టాప్‌లోని మూడు చుక్కలపై క్లిక్ చేయండి. 3. 'సెట్టింగ్స్' ఆప్షన్‌లోకి వెళ్ళి, అక్కడ "ప్రైవసీ" సెక్షన్‌పై క్లిక్ చేయండి. 4. కిందకి స్క్రోల్ చేసి, 'అడ్వాన్స్' ఆప్షన్‌ పై క్లిక్ చేయండి. 5. ఇక్కడ మీరు "ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్" ఆప్షన్ కనిపించవచ్చు, దీనిని యాక్టివేట్ చేయండి. మీరు వాట్సాప్ కాల్ చేస్తూ ఉన్నప్పుడు, మీ లొకేషన్‌ను ఇతరులు ట్రాక్ చేయడం కష్టమవుతుంది. ఈ సెట్టింగ్స్‌ను మార్చడం ద్వారా, మీరు మీ ప్రైవసీని మరింత రక్షించుకోవచ్చు.