Loading...
Doomsday:  నవంబర్ 13న డూమ్స్‌డే.. ప్రపంచ వినాశనంపై అసలు నిజాలివే..
నవంబర్ 13న డూమ్స్‌డే.. ప్రపంచ వినాశనంపై అసలు నిజాలివే..

Doomsday:  నవంబర్ 13న డూమ్స్‌డే.. ప్రపంచ వినాశనంపై అసలు నిజాలివే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచం అంతం కాబోతోందా? నవంబర్ 13, 2026న యుగాంతం సంభవిస్తుందా? 60 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు చేసిన అంచనాలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ప్రపంచం అంతమవుతుందనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వాదనల్లో నిజమెంత? శాస్త్రవేత్తలు అప్పట్లో ఏం చెప్పారు? 1960వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఇదే స్థాయిలో పెరుగుతూ ఉంటే, అందరికీ సరిపడా ఆహారాన్ని అందించే స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగకపోవచ్చని హెచ్చరించారు. దీంతో భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడి, ఆకలి చావులు పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

గణిత సూత్రాల ఆధారంగా ప్రపంచం అంతమయ్యే తేదీ

'డూమ్స్‌డే: ఫ్రైడే 13 నవంబర్ 2026' అనే శీర్షికతో 'సైన్స్' జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసం అప్పట్లో ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.

ప్రొఫెసర్ హీంజ్ వోన్ ఫోర్‌స్టెర్ నేతృత్వంలోని బృందం చేసిన గణాంక అంచనాల ప్రకారం.. 2026 నవంబర్ 13 నాటికి మానవ జనాభా అనంతానికి చేరుకుంటుందని పేర్కొన్నారు.

ఈ అంచనా ఆధారంగానే ఆ తేదీని డూమ్స్‌డేగా అభివర్ణించారు.

జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో, ఆహార సాంకేతికత, పారిశ్రామిక విజ్ఞానం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతాయని ఫోర్‌స్టెర్ వాదించారు.

ఆయన రూపొందించిన గణిత సూత్రాల ఆధారంగా ప్రపంచం అంతమయ్యే తేదీని లెక్కించారు.

వివరాలు 

3 కారణాలు.. ఆందోళన అవసరం లేదు!

మరోవైపు జియాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ టెక్లా కూడా 2026 నవంబర్ 13 గురించి ప్రమాదకరమైన అంచనాలు చేశారు.

ఆ రోజున సూర్యుడి నుంచి గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన శక్తి విడుదలవుతుందని చెప్పారు.

దీనివల్ల భూమి అయస్కాంత క్షేత్రంలో భారీ మార్పులు చోటుచేసుకుని, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విధ్వంసం సంభవిస్తుందని పేర్కొన్నారు.

నవంబర్ 13 వచ్చిందని ప్రపంచం అంతమవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి.

మొదటిది.. ప్రొఫెసర్ ఫోర్‌స్టెర్ చేసిన అంచనా కేవలం గణిత సూత్రాల ఆధారంగా రూపొందించిన సిద్ధాంతం మాత్రమే. జనాభా అనంతానికి చేరుకుంటుందనే లెక్క వాస్తవ పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు. అందువల్ల ఈ అంచనాను ప్రపంచ వినాశనానికి సంకేతంగా భావించలేం.

ADVERTISEMENT

వివరాలు 

3 కారణాలు.. ఆందోళన అవసరం లేదు!

రెండోది.. డాక్టర్ మైఖేల్ టెక్లా చేసిన వాదనల్లోనూ శాస్త్రీయంగా అనేక లోపాలున్నాయి. సూర్యుడిపై తరచూ అసాధారణ కార్యకలాపాలు, శక్తివంతమైన విస్ఫోటనాలు చోటుచేసుకుంటుంటాయి. అయితే అలాంటి పరిణామాలు ఒక్క రోజులోనే మొత్తం భూమిని నాశనం చేసే స్థాయిలో ఉంటాయని చెప్పడానికి ఆధారాలు లేవు.

మూడోది.. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు ఉపగ్రహాల సాయంతో అంతరిక్షంలోని పరిణామాలను నిరంతరం పరిశీలిస్తున్నారు. ఏదైనా అసాధారణమైన ఖగోళ సంఘటన సంభవించే సూచనలు ఉంటే వాటిని ముందుగానే గుర్తించే అవకాశం ఉంది.

అందువల్ల 1960వ దశకంలో వెలువడిన అంచనాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి ప్రపంచం అంతమవుతుందని భావించడం సరికాదు.

నవంబర్ 13, 2026న యుగాంతం సంభవిస్తుందనే వాదనకు విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

ADVERTISEMENT