
Whatsapp: మీ వాట్సాప్ ఖాతా సురక్షితంగా ఉందా? సైబర్ నేరస్థులు దీన్ని హ్యాక్ చేసే మార్గాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
సందేశాలు,ఫోటోలు,వీడియోలు సురక్షితంగా ఉండాలంటే వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (End-to-End Encryption) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ... సైబర్ నేరగాళ్లు దాన్ని హ్యాక్ చేయడంలో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. యాప్‌లో కాకుండా, వినియోగదారులపై దాడులు చేయడం ద్వారా వాళ్లు అకౌంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. సోషల్ ఇంజినీరింగ్,టెలికాం మోసం,మాల్వేర్ వంటి పద్ధతులతో వ్యక్తిగత యూజర్ల ఫోన్లలో ఉన్న లోపాలను గుర్తించి దాడి చేస్తున్నారు. ఈ అకౌంట్లను ఉపయోగించి ప్రైవేట్ మెసేజ్‌లు చదవడం,యూజర్ పేరుతో మోసపూరిత సందేశాలు పంపడం,డబ్బు వసూలు చేయడం,వైరస్‌లు వ్యాప్తి చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. 50 కోట్లకు పైగా యూజర్లతో భారత్‌లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
సిమ్
సిమ్ స్వాపింగ్ లేదా పోర్ట్ అవుట్ మోసం
ఫోన్ నంబర్లను బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీల కోసం విస్తృతంగా ఉపయోగించడమే ఇక్కడి యూజర్లకు ప్రధాన ప్రమాదంగా మారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా జరిగే మోసం. దొంగలు బాధితుడి పేరుతో టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లను మోసం చేస్తారు. నకిలీ పత్రాలు చూపించడం లేదా ఉద్యోగులకు లంచం ఇవ్వడం ద్వారా బాధితుడి నంబర్‌ను కొత్త సిమ్‌లోకి మార్చేస్తారు. దీంతో దొంగలకు ఆ నంబర్‌పై పూర్తి నియంత్రణ వస్తుంది. వాట్సాప్, బ్యాంకింగ్ సహా అన్ని వెరిఫికేషన్ కోడ్‌లు వాళ్లకే చేరుతాయి. భారత్‌లో ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, పూణే, ముంబయి ప్రాంతాల్లో ఇవి ఎక్కువ. ఈ పద్ధతిని పెద్ద ఎత్తున బ్యాంకింగ్, యూపీఐ మోసాలకు వాడుతున్నారు. అమెరికా, యూకేల్లో కూడా ఇలాంటి మోసాలే క్రిప్టో దోపిడీలకు ఉపయోగిస్తున్నారు.
వివరాలు
సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వెరిఫికేషన్ కోడ్ ఫిషింగ్
భద్రత కోసం: మీ సిమ్ కార్డు కోసం పిన్ లేదా పోర్ట్ పాస్‌వర్డ్ సెట్ చేయండి. అనూహ్యంగా సర్వీస్ ఆగిపోతే వెంటనే టెలికాం ఆపరేటర్‌ను సంప్రదించండి. "పోర్ట్ ఫ్రీజ్" సేవ అందుబాటులో ఉంటే, దాన్ని యాక్టివేట్ చేయండి. దొంగలు వాట్సాప్ లాగిన్ సమయంలో వచ్చే SMS కోడ్‌ను యూజర్ నుంచి మోసం చేసి తీసుకుంటారు. మిత్రులు,కుటుంబ సభ్యులు,బ్యాంకులు లేదా వాట్సాప్ సపోర్ట్ టీమ్‌లుగా నటిస్తూ అత్యవసర లేదా భావోద్వేగ పరిస్థితులు సృష్టించి కోడ్ చెప్పమని అడుగుతారు. భారత్‌లో ఈ రకమైన మోసాలు విస్తృతంగా జరుగుతున్నాయి.
వివరాలు
కాల్స్ ఫార్వార్డింగ్ మోసం
యూజర్ కాంటాక్ట్‌లకు చేరుకున్నాక, వాళ్ల ద్వారా డబ్బు వసూలు చేసే చైన్ స్కామ్‌లు ప్రారంభిస్తారు. యూకే, యూరప్‌లో"Hi Mum"అనే స్కామ్‌లో 1.5మిలియన్ పౌండ్లు దోచుకున్నారు. భద్రత కోసం: ఎవరికీ వెరిఫికేషన్ కోడ్ చెప్పొద్దు.వాట్సాప్‌లో Settings > Account > Two-step verification ఆప్షన్ ద్వారా రెండు దశల భద్రతను యాక్టివేట్ చేయండి. స్కామర్లు బాధితుల నుంచి 21కోడ్‌తో తమ నంబర్ డయల్ చేయమని చెబుతారు. ఇలా కాల్ ఫార్వార్డింగ్ సెట్ అయ్యి వెరిఫికేషన్ కాల్స్ కూడా దొంగల దగ్గరికి వెళ్తాయి. పూణే,ముంబయి,ఢిల్లీ-NCRలో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. భద్రత కోసం: *#21# ద్వారా మీ ఫార్వార్డింగ్ స్టేటస్ చెక్ చేయండి. ##21# ద్వారా దానిని డిసేబుల్ చేయండి. ఏ తెలియని కోడ్లు డయల్ చేయకండి.
వివరాలు
వాట్సాప్ వెబ్ కోసం QR కోడ్ ఫిషింగ్ లేదా 'క్విషింగ్'
ఫేక్ వెబ్‌సైట్‌లకు దారి తీసే QR కోడ్‌లను పంపి, వాట్సాప్ వెబ్ యాక్సెస్ పొందే మోసాలు జరుగుతున్నాయి. బాధితుడు స్కాన్ చేసిన వెంటనే, హ్యాకర్లు అతని అకౌంట్‌లోకి లాగిన్ అవుతారు. బెంగళూరులో ఇలాంటి ఘటనలు జాబ్ స్కామ్‌ల రూపంలో వెలుగుచూశాయి. భద్రత కోసం: ఎప్పుడూ web.whatsapp.com నుండి మాత్రమే QR స్కాన్ చేయండి. Unknown devices లాగిన్‌లను Settingsలో చెక్ చేసి లాగ్ అవుట్ చేయండి.
వివరాలు
మాల్వేర్, స్పైవేర్ దాడులు
పెగసస్, పారాగాన్ వంటి ప్రమాదకర స్పైవేర్‌లు ఫోన్లో ఇన్‌స్టాల్ అయితే వాట్సాప్ మెసేజ్‌లు, కోడ్‌లు దొంగిలిస్తాయి. 2025లో జర్నలిస్టులు, యాక్టివిస్టులు లక్ష్యంగా 90కు పైగా స్పైవేర్ కేసులు నమోదయ్యాయి. భద్రత కోసం: తెలియని యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు. సిస్టమ్, వాట్సాప్ అప్డేట్ చేయండి. నమ్మదగిన యాంటీవైరస్ ఉపయోగించండి. వాయిస్‌మెయిల్ హ్యాకింగ్ వాట్సాప్ వెరిఫికేషన్ కాల్ మిస్ అయితే కోడ్ వాయిస్‌మెయిల్‌లో పడుతుంది. బలహీనమైన పిన్‌లతో ఉన్న వాయిస్‌మెయిల్ సిస్టమ్‌లను హ్యాక్ చేసి దొంగలు కోడ్‌ను దొంగిలిస్తారు. భద్రత కోసం: బలమైన వాయిస్‌మెయిల్ పిన్ సెట్ చేయండి. అనుమానాస్పద యాక్సెస్ ఉంటే వెంటనే రీసెట్ చేయండి.
వివరాలు
ఫేస్‌బుక్ ద్వారా మోసాలు
మెటా (Meta) యాజమాన్యంలోని ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లింక్ అకౌంట్ల ద్వారా వాట్సాప్ కోడ్‌లు ఫిష్ చేసే ఘటనలు నమోదయ్యాయి. కొన్నిసార్లు క్రిప్టో మోసాలకు వాడుతున్నారు. భద్రత కోసం: మెటా అకౌంట్లకు బలమైన పాస్‌వర్డ్, రెండు దశల భద్రత (2FA) యాక్టివేట్ చేయండి. అనుమానాస్పద గ్రూప్ ఆహ్వానాలను అంగీకరించకండి. ఫోన్ దొంగతనం లేదా క్లోనింగ్ దొంగిలించిన లేదా పోయిన ఫోన్లను ఉపయోగించి అకౌంట్ రీస్టోర్ చేయడం, సిమ్ క్లోన్ చేయడం వంటి మోసాలు జరుగుతున్నాయి. ముంబయి, ఢిల్లీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువ. భద్రత కోసం: ఫింగర్‌ప్రింట్, పిన్ లాక్ వాడండి. WhatsApp Webలో లింక్ అయిన డివైస్‌లను చెక్ చేయండి.
వివరాలు
క్లౌడ్ బ్యాకప్ దాడులు
గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ వంటి బ్యాకప్‌లలో ఎన్‌క్రిప్షన్ ఆన్ లేకపోతే దొంగలు చాట్స్ రీస్టోర్ చేయగలరు. భద్రత కోసం: WhatsApp సెట్టింగ్స్‌లో End-to-End Encrypted Backup యాక్టివేట్ చేయండి. క్లౌడ్ అకౌంట్లకు బలమైన పాస్‌వర్డ్, మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వాడండి. ఫేక్ లేదా మోడిఫైడ్ యాప్స్ అధికారికంగా కాని WhatsApp వెర్షన్‌లు లేదా APK ఫైల్‌లు డౌన్‌లోడ్ చేస్తే మీ అకౌంట్ వివరాలు దొంగల చేతుల్లో పడవచ్చు. భద్రత కోసం: Google Play లేదా Apple App Store లేదా web.whatsapp.com నుంచే యాప్ డౌన్‌లోడ్ చేయండి.
వివరాలు
మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఎలా తెలుసుకోవాలి?
అకస్మాత్తుగా లాగ్ అవుట్ కావడం లేదా "Registered on a new device" నోటిఫికేషన్ రావడం. తెలియని వెరిఫికేషన్ కోడ్‌లు రావడం. మీరు పంపని సందేశాలు మీ నంబర్ నుండి వెళ్లడం. మిత్రులు మీ పేరుతో డబ్బు అడిగే మెసేజ్‌లు రావడం. Linked Devicesలో తెలియని లాగిన్‌లు కనిపించడం. మీరు తెరవకపోయినా మెసేజ్‌లు 'బ్లూ టిక్స్'తో రీడ్‌గా కనిపించడం.
వివరాలు
హ్యాక్ అయితే వెంటనే చేయాల్సినవి
వెంటనే మీ నంబర్‌తో వాట్సాప్ రీ-రిజిస్టర్ చేయండి. దాంతో దొంగ లాగ్ అవుట్ అవుతాడు. మీ మిత్రులు, కుటుంబ సభ్యులకు ఇతర మార్గంలో సమాచారం ఇవ్వండి. WhatsApp లో Help ద్వారా రిపోర్ట్ చేయండి. సిమ్ స్వాప్ అనుమానం ఉంటే మొబైల్ ఆపరేటర్‌ను సంప్రదించండి. ఈమెయిల్, క్లౌడ్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లు మార్చి MFA యాక్టివేట్ చేయండి. స్థానిక సైబర్‌క్రైమ్ శాఖకు ఫిర్యాదు చేయండి. (భారత్‌లో: cybercrime.gov.in ) ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉంటుంది. సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వొద్దు .. "కోడ్ చెప్పొద్దు, లింక్ క్లిక్ చేయొద్దు!"