Is your YouTube : మీ YouTube కంటెంట్ AIని శక్తివంతం చేస్తుందా? Apple, NVIDIA పద్ధతులు బహిర్గతం
ఆపిల్ NVIDIA , ఆంత్రోపిక్‌తో సహా అనేక ప్రముఖ సాంకేతిక సంస్థలు,లక్షలాదిగా యూట్యూబ్ వీడియోల నుండి ట్రాన్‌స్క్రిప్ట్‌లను ఉపయోగించినట్లు తెలిపింది. ఇందుకు కంటెంట్ సృష్టికర్తల నుండి అనుమతి పొందకుండానే 170,000 పైగా YouTube వీడియోల నుండి ట్రాన్‌స్క్రిప్ట్‌లను ఉపయోగించినట్లు పేర్కొంది. వారి కృత్రిమ మేధస్సు (AI) మోడల్‌లకు శిక్షణ ఇవ్వడానికి వీటిని వినియోగించింది.
ఛానెల్ ల నుండి ఉపశీర్షిక
YouTubeలో 48,000 కంటే ఎక్కువ ఛానెల్‌ల నుండి ఉపశీర్షిక ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసిన లాభాపేక్షలేని సంస్థ EleutherAI రూపొందించిన డేటాసెట్ నుండి ట్రాన్స్క్రిప్ట్‌లు పొందాయి. ఈ డేటాసెట్ "ది పైల్" అని పిలిచే పెద్ద సంకలనంలో భాగంగా వుంది. ఇది ప్రధానంగా చిన్న డెవలపర్‌లు విద్యావేత్తల ఉపయోగం కోసం ఉద్దేశించి రూపొందించారు..