Page Loader
ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నెలాఖరున స్పేస్ డాకింగ్ మిషన్ ప్రారంభం 
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నెలాఖరున స్పేస్ డాకింగ్ మిషన్ ప్రారంభం

ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నెలాఖరున స్పేస్ డాకింగ్ మిషన్ ప్రారంభం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2024
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. డిసెంబర్ 30న రాత్రి 9:30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ C-60 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న జంట ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో, పీఎస్‌ఎల్‌వీ C-59 రాకెట్‌ను ఈ నెల 5న విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగం తర్వాత, ఇస్రో ప్రస్తుతం పీఎస్‌ఎల్‌వీ C-60 ప్రయోగానికి పూర్తి స్థాయి సిద్ధమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో చేసిన ట్వీట్