LOADING...
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయాణంలో మరో కీలక ఘట్టం నమోదైంది. బుధవారం ఉదయం 8.54 గంటలకు ఎల్వీఎం-3 ఎం-6 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి అమెరికాకు చెందిన ఆధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం 'బ్లూ బర్డ్ బ్లాక్-2'ను ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపింది. సుమారు 6,400 కిలోల బరువున్న భారీ ఉపగ్రహాన్ని మోసుకుంటూ నిప్పులు చిమ్ముతూ రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది.

వివరాలు 

వాణిజ్య ప్రయోగం

ఈ వాణిజ్య ప్రయోగంతో ఇస్రో తన బాహుబలి రాకెట్ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. రాకెట్ మొత్తం మూడు దశలను సుమారు 15.07 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేసి, ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్‌ (లియో)లోకి ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఈ ప్రయోగాన్ని ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నిర్వహించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో నుంచి లైవ్ 

Advertisement