LOADING...
ISRO: మార్చిలోగా ఏడు ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఇస్రో.. ఈ కీలక ప్రయోగాలలో గగన్‌యాన్ ఒకటి 
ఈ కీలక ప్రయోగాలలో గగన్‌యాన్ ఒకటి

ISRO: మార్చిలోగా ఏడు ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఇస్రో.. ఈ కీలక ప్రయోగాలలో గగన్‌యాన్ ఒకటి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్‌యాన్‌ మిషన్‌లో భాగమైన మానవ రహిత ప్రయోగంతో పాటు మొత్తం ఏడు రాకెట్‌ ప్రయోగాలను వరుసగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మార్చి 2026 నాటికి ఈ ఏడు ప్రయోగాలన్నింటినీ పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఈ శ్రేణిలో తొలి ప్రయోగంగా 'బ్లూబర్డ్‌-6' ఉపగ్రహాన్ని వచ్చే వారం అంతరిక్షంలోకి పంపనున్నారు. గగన్‌యాన్‌ మిషన్‌ కింద జరగనున్న మానవ రహిత ప్రయోగంలో 'వ్యోమిత్రా' అనే రోబోను రోదసిలోకి పంపి, అనంతరం సురక్షితంగా భూమిపైకి తీసుకురావాలని ఇస్రో యోచిస్తోంది. 2027లో భారత్‌ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయాణానికి ఇది ముందస్తు సన్నాహకంగా కీలక పాత్ర పోషించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మార్చిలోగా ఏడు ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఇస్రో

Advertisement