Page Loader
చంద్రుని శాశ్వత నీడపై ఇస్రో అన్వేషణ 
చంద్రునిపై నీడ ఉన్న ప్రాంతాలపై అన్వేషణ

చంద్రుని శాశ్వత నీడపై ఇస్రో అన్వేషణ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చంద్ర ధ్రువ అన్వేషణ మిషన్ ద్వారా చంద్రునిపై శాశ్వత నీడ ఉన్న ప్రాంతాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తోంది. రాబోయే చంద్ర యాత్ర కోసం అంతరిక్ష సంస్థ జపాన్‌తో కలిసి పనిచేసింది. జూన్ లో ఈ మీషన్ ను ప్రారంభించడానికి ఇస్రో సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2019లో చైనా తన చాంగ్‌ఇ-4 మిషన్ ద్వారా చంద్రునికి అవతల వైపున తాకి చరిత్ర సృష్టించింది. చంద్ర అన్వేషణ మిషన్‌ ను ప్రారంభించడానికి ఇస్రో ఎంతో ఆసక్తిగా ఉంది. LUPEX మిషన్ ప్రధాన లక్ష్యం చంద్రుని ధ్రువ ప్రాంతాలలో నీటి ఉనికిని నిర్ధారించడం. అంతరిక్ష నౌక ఇస్రో, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)రెండింటి నుండి అనేక శాస్త్రీయ పరికరాలను తీసుకెళ్లనుంది.

Details

చంద్రునిపై అన్వేషణ, ఉపగ్రహ నావిగేషన్ పై ఇస్రో దృష్టి

ఈ మిషన్‌లో రోవర్, ల్యాండర్ ఉండనున్నాయి. ల్యాండర్ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేస్తుండగా.. రోవర్‌ను జాక్సా నిర్మించనుంది. LUPEX మిషన్‌ను జపాన్ రాకెట్ మీదుగా ప్రయోగించనున్నారు. ఇది చంద్రుని దక్షిణ ధృవం మీద ల్యాండ్ చేయడానికి నిర్ధిష్ట ప్రణాళికలు సిద్ధం చేశారు. మిషన్ ప్రారంభించడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. JAXA నుండి ఒక బృందం LUPEX మిషన్ గురించి చర్చించడానికి ఇటీవల ఇండియాకొచ్చి ఇస్రో శాస్తవేత్తలను కలిశారు. LUPEX మిషన్‌కు సంబంధించి 2022-23 వార్షిక నివేదికలో భారత్-జపాన్ అంతరిక్ష సహకారం ప్రస్తుతం చంద్రునిపై అన్వేషణ, ఉపగ్రహ నావిగేషన్, భూమి పరిశీలనపై దృష్టి సారిస్తుందని ఇస్రో పేర్కొంది.