మూడు భారీ ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ ప్రయోగాలకు సిద్ధమైంది. మూడు నెలల్లో మూడు ప్రయోగాలకు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లను చకచకా చేస్తోంది.
ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) ఉద్యోగులు, శాస్త్రవేత్తలు ఆ ప్రాజెక్టుల పనుల్లో నిమగ్నమయ్యారు.
జూలైనాటికి ఆ ప్రయోగాలను పూర్తి చేయాలని ఇస్రో ఇప్పటికే ప్రణాళికలు పూర్తి చేసిందట. చాలాకాలంగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో మరో రెండు నెలల్లో ప్రయోగించనుంది. దీనికి అత్యంత శక్తిమంతవతమైన వాహననౌక 'లాంచ్ వెహికల్ మార్క్ (ఎల్‌వీఎం)-3ని వాడనున్నారు.
ఆర్బిటరీ, ల్యాండర్, రోవర్ తో చంద్రయాన్-2 మాదిరిగానే దీని నిర్మాణం ఉంటుంది. ఈ సారి ఈ ప్రాజెక్టును ఎలాగైనా విజయవంతం చేయాలని శాస్త్రవేత్తలు గట్టి పట్టుదలతో ఉన్నారు.
Details
దేశ తొలి సోలార్ మిషన్ ప్రయోగం ఆదిత్య-ఎల్1
దేశ తొలి సోలార్ మిషన్ అయిన ఆదిత్య-ఎల్ 1 పీఎస్ఎల్‌వీ వాహననౌక ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. సూర్యుని ఉపరితలంపై ఉష్ణ్రోగ్రతల్లో తేడాతలు, సౌర తుఫానాలు, భూమిపై ఏర్పడే విపత్తులను తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. అదే విధంగా సైనిక్, ప్రజావసరాలకు వీలుగా నావిక్ ను దశల వారీగా అభివృద్ధి చేయడం ఇస్రో ధ్యేయం.
దీని కోసం ఇప్పటికే 8 ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. తాజాగా మరో ఉపగ్రహ ప్రయోగం చేపడితే నావిక్ ను సమర్థవంతంగా అందుబాటులోకి తేవచ్చని ఇస్రో అభిప్రాయపడింది.
ఈ భారీ ప్రయోగాలకు సంబంధించిన తేదీలను ఇస్రో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.