సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో నుండి ఆదిత్య-ఎల్1: ప్రయోగం తేదీని వెల్లడి చేసిన ఇస్రో
చంద్రయాన్-3 విజయంతో భారతదేశమంతా సంతోషంగా ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య- ఎల్1 మిషన్ ని చేపట్టనున్నారు. సూర్యుడు- భూమి వ్యవస్థలోని ఒకానొక పాయింట్ నుండి సూర్యుడిని ఆదిత్య-ఎల్1 మిషన్ గమనిస్తూ ఉంటుంది. సూర్యుడిలో జరుగుతున్న మార్పులను దగ్గరి నుండి తెలుసుకోవడానికి ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. తాజాగా ఈ మిషన్ లాంచ్ తేదీని ఇస్రో వెల్లడి చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11:50గంటలకు శ్రీహరికోట నుండి ఆదిత్య-ఎల్1 మిషన్ ని ప్రయోగించబోతున్నట్లు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఇస్రో వెల్లడి చేసింది.