Page Loader
Google: గూగుల్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. ఆండ్రాయిడ్‌, పిక్సెల్‌ యూనిట్లపై వేటు!
గూగుల్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. ఆండ్రాయిడ్‌, పిక్సెల్‌ యూనిట్లపై వేటు!

Google: గూగుల్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. ఆండ్రాయిడ్‌, పిక్సెల్‌ యూనిట్లపై వేటు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్‌ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగులపై లేఆఫ్‌ల వేటు వేయడంతో టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌, డివైజ్‌ యూనిట్లలో పనిచేస్తున్న వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు వార్తలొచ్చాయి. వీరిలో ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, పిక్సెల్‌ ఫోన్లు, క్రోమ్‌ బ్రౌజర్ల వంటి ముఖ్య విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఈ లేఆఫ్‌లకు సంబంధించి గూగుల్‌ అధికారికంగా ఎంతమంది ఉద్యోగులను తొలగించిందో ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే 'ది ఇన్ఫర్మేషన్‌' అనే ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల పేర్కొనడంతో వార్తలు వైరలయ్యాయి.

Details

10శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ లు

ఇది గూగుల్‌ సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగమే. రెండు సంవత్సరాలుగా కంపెనీ ఖర్చుల తగ్గింపు దిశగా నడుస్తూ అనేక విభాగాల్లో లేఆఫ్‌లు చేస్తోంది. గతేడాది డిసెంబర్‌లో మేనేజర్లు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌ఆర్‌, క్లౌడ్‌ విభాగాల్లోని కొంతమందిని తొలగించింది. 2022లోనే గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్ సంస్థలో 20 శాతం మంది మరింత సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఏడాదే సంస్థ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

Details

లేఆఫ్ లకు మరింత ప్రాధాన్యత

ఇక అమెరికాలో విదేశీ నిపుణులపై కఠినమైన వీసా నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో, ఈ లేఆఫ్‌లకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే సమయంలో మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కూడా మే నెలలో ఉద్యోగాల కోతలు చేపట్టనుందన్న వార్తలు టెక్ పరిశ్రమలో మరింత అస్థిరతను తీసుకొస్తున్నాయి.