'Kekius Maximus':ఎలాన్ మస్క్ అధికారిక X ఖాతాలో కొత్త పేరు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కుబేరుడు,టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) తన పేరును మార్చుకున్నారు.
తన స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ (official X account)లో తన పేరును మస్క్‌కు బదులుగా 'కేకియస్ మాక్సిమస్' (Kekius Maximus)గా మార్చుకున్నారు.
ఈ పరిణామాన్ని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి,ఆ పేరుకు అర్థం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్ అని,ఇది పలు బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఎలాన్ మస్క్ ఇటీవలే ఓ అరుదైన రికార్డు సృష్టించారు.
వివరాలు
స్క్ సంపద విలువ ప్రస్తుతం 447 బిలియన్ డాలర్లు
ప్రపంచంలోనే ధనవంతుడిగా గుర్తింపు పొందిన మస్క్, తన వ్యక్తిగత సంపదను 400 బిలియన్ డాలర్ల మార్కును దాటించి ఓ అరుదైన ఘనత సాధించారు.
ఇప్పటి వరకు ఈ మైలురాయిని అధిగమించిన వ్యక్తి ఎవరూ లేకపోవడంతో, ఈ రికార్డును సాధించిన మొదటి వ్యక్తిగా మస్క్ నిలిచారు.
బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా వివరాల ప్రకారం, మస్క్ సంపద విలువ ప్రస్తుతం 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడైంది.