Spacex Rocket: చంద్రుడిపై స్పేస్-X రాకెట్ శకలం క్రాష్.. ఫొటోలు విడుదల చేసిన కొరియా
ఈ వార్తాకథనం ఏంటి
స్పేస్-Xకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ శకలం చంద్రుడి ఉపరితలంపై కూలింది. ఆ శకలం చంద్రుడిని ఢీకొట్టడానికి ముందు, అనంతరం చోటుచేసుకున్న మార్పులను దక్షిణ కొరియాకు చెందిన శాటిలైట్ స్పష్టంగా చిత్రీకరించింది. ఫాల్కన్ 9 రాకెట్ శకలం ప్రమాదవశాత్తూ చంద్రుడిని ఢీకొట్టిన సమయంలో దక్షిణ కొరియా తొలి చంద్రయాన మిషన్ 'దనూరి' స్పేస్‌క్రాఫ్ట్ అదే ప్రాంతం మీదుగా ప్రయాణించింది. చంద్రుడి కక్ష్యలో నుంచి తీసిన చిత్రాలను దక్షిణ కొరియా అంతరిక్ష సంస్థ తాజాగా విడుదల చేసింది. శకలం ఢీకొట్టిన ప్రభావంతో చంద్రుడి ఉపరితలంపై ఒక గొయ్యి ఏర్పడగా,పెద్ద ఎత్తున దుమ్ము, రాళ్లు చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. ప్రమాదానికి ముందు తీసిన చిత్రాలతో పోలిస్తే ప్రస్తుతం ఆ ప్రాంతం నల్లటి మచ్చలా కనిపిస్తున్నట్లు ఫొటోల్లో స్పష్టమైంది.
వివరాలు
స్పేస్ వాక్ చేసిన నాసా వ్యోమగాములు..
దక్షిణ కొరియా తన తొలి చంద్రయాన మిషన్ 'దనూరి'ని 2022 ఆగస్టులో స్పేస్-X రాకెట్ ద్వారానే విజయవంతంగా ప్రయోగించింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) వెలుపల నాసా వ్యోమగాములు అనిల్ మేనన్ (భారత సంతతి), జెస్సికా మీర్ స్పేస్‌వాక్ నిర్వహించారు.
అంతరిక్ష కేంద్రంలోని పవర్ ఛానల్‌కు అవసరమైన మాడిఫికేషన్ కిట్‌ను అమర్చేందుకు ఈ స్పేస్‌వాక్ చేపట్టారు.
అనిల్ మేనన్‌కు ఇది తొలి స్పేస్‌వాక్ కావడం విశేషం. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి అనిల్ మేనన్ ఇటీవల ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు.
ఈ బృందం ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనుండగా, 2027 ఏప్రిల్‌లో భూమికి తిరిగి రానుంది.