ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు
ట్విట్టర్ SMS టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) పద్ధతి నుండి మారడానికి ఈరోజే చివరి రోజు. మార్చి 20వ తేదీ నుండి ట్విట్టర్ దాని SMS ఆధారిత 2FAని నెలకు $8 బ్లూ సబ్స్క్రిప్షన్ తో అందిస్తుంది. ఈ మార్పులో భాగంగా, SMS ధృవీకరణ నుండి వైదొలగపోతే లేదా ఆ గడువులోపు చెల్లించకపోతే ట్విట్టర్ ఖాతా 2FAని పూర్తిగా ఆఫ్ చేస్తుంది, అప్పుడు ఆ ఖాతా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ ఆలస్యం కాలేదు Google Authenticator లేదా Authy వంటి ప్రమాణీకరణ యాప్‌ని ఉపయోగించి 2FAని ఉచితంగా ప్రారంభించవచ్చు. సెక్యూరిటీ కీని కూడా ఉపయోగించవచ్చు.