AI Robot Girlfriend: మార్కెట్‌లోకి ఏఐ గర్ల్‌ఫ్రెండ్ 'అరియా' లాంచ్.. ఖరీదెంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.
ముందుగా రోబోలు మానవాళిని ఆశ్చర్యానికి గురిచేయగా, ఇప్పుడు ఏఐ ఆధారిత రోబోట్‌లు మానవుల భావోద్వేగాలను అర్థం చేసుకునే స్థాయికి ఎదిగాయి.
కొంతకాలం క్రితం ఏఐ యాంకర్స్‌కు సృష్టి పుట్టగొడితే, తాజాగా ఏఐ రోబోట్ గర్ల్‌ఫ్రెండ్ 'అరియా' అందుబాటులోకి వచ్చింది.
లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2025)లో అమెరికన్ టెక్ సంస్థ రియల్‌బోటిక్స్ తన అత్యాధునిక ఏఐ రోబోట్ 'అరియా'ను పరిచయం చేసింది.
ఇది మానవుల మాదిరిగా ముఖ కవలికలను, భావాలను వ్యక్తపరచగలదు.
Details
అరియా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
అయితే ఈ రోబోట్‌ను సొంతం చేసుకోవాలంటే దాదాపు రూ. 1.5 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
రియల్‌బోటిక్స్ సీఈఓ ఆండ్రూ కిగుయెల్ మాట్లాడుతూ అరియా మానవుల ఒంటరితనానికి ఒక పరిష్కారం కావడమే తమ లక్ష్యమని అన్నారు.
ఈ ఏఐ రోబోట్‌లో 17 మోటార్లు అమర్చారు. ఇవి మెడ కదలికలతో పాటు ఇతర శరీరభాగాల కదలికలకు సహాయం చేస్తాయి. అరియా ముఖ కవలికలు, జుట్టు రంగు, హెయిర్‌స్టైల్ మొదలైనవి పూర్తిగా కస్టమైజ్ చేయవచ్చు.
అరియాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అరియా మూడు వెర్షన్లగా రూపొందించారు.
Details
టెక్నాలజీతో కొత్త అధ్యాయానికి నాంది
ప్లేస్ వేరియంట్‌లో మెడ పైభాగం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధర సూమారుగా రూ. 8.6 లక్షలు ఉండనుంది.
మాడ్యులర్ వర్షన్‌లో మరింత అధునాతన ఫీచర్లు కలిగిన రోబోట్ ధరను రూ.1.29 కోట్లగా నిర్ణయించారు. ఫుల్ సైజ్ మోడల్ వర్షన్‌లో పూర్తి మానవాకారంతో అన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
దీని ధర రూ. 1.5 కోట్లు ఉండనుంది. రియల్‌బోటిక్స్, మానవుల అభిరుచులకు అనుగుణంగా సామాజిక ఇంటెలిజెన్స్‌తో కూడిన రోబోట్‌లను రూపొందించడంలో ముందంజలో ఉంది.
'అరియా' విడుదలతో టెక్నాలజీ, సామాజిక పరిణామంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.