Page Loader
Lava Blaze Dragon Launch: 'లావా బ్లేజ్ డ్రాగన్' వచ్చేస్తోంది.. రూ.11 వేలకే అద్భుత ఫీచర్లు!
'లావా బ్లేజ్ డ్రాగన్' వచ్చేస్తోంది.. రూ.11 వేలకే అద్భుత ఫీచర్లు!

Lava Blaze Dragon Launch: 'లావా బ్లేజ్ డ్రాగన్' వచ్చేస్తోంది.. రూ.11 వేలకే అద్భుత ఫీచర్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లావా మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం 'లావా బ్లేజ్ డ్రాగన్' పేరుతో విడుదల కాబోతున్న ఈ ఫోన్‌ను జులై 25న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అదే నెలలోనే 'లావా బ్లేజ్ అమోలెడ్ 2' ఫోన్‌ను కూడా విడుదల చేయనున్నప్పటికీ, దాని లాంచ్ తేదీపై కంపెనీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు.

Details

లావా బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్ స్పెసిఫికేషన్స్

టెక్ వర్గాల నుంచి లభించిన సమాచారం ప్రకారం లావా బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్‌లో 6.67 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో మిడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉపయోగించే అవకాశముంది. అదనంగా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ తో కూడిన వెర్షన్‌ను కూడా అందించవచ్చని సమాచారం. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది. ఇందులో స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని యూజర్లు పొందగలుగుతారు.

Details

 కెమెరా, బ్యాటరీ, స్టోరేజ్

లావా బ్లేజ్ డ్రాగన్‌ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 8MP సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌కు 5000mAh బ్యాటరీ ఉంటుంది. దీని కోసం 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు లభిస్తుంది. ఈ డివైస్‌ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తేనున్నారు 4GB RAM + 128GB స్టోరేజ్ 6GB RAM + 128GB స్టోరేజ్ ఈ ఫోన్‌ను అమెజాన్‌లో విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ ధరగా రూ.11,000గా ఉండే అవకాశం ఉంది. పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు లావా సంస్థ సమాచారం ఇచ్చింది