
Reels On WhatsApp: వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను నేరుగా వాట్సాప్‌లో చూడడం అనేది వినియోగదారుల కోసం మెటా తీసుకొచ్చిన కొత్త ఫీచర్.
సాధారణంగా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తున్నప్పుడు అయితే వాట్సాప్‌లో మెసేజులు వస్తుంటాయి. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్ నుంచి బయటకు రావాల్సి వస్తుంది.
ఇలాంటి ఇబ్బందిని తొలగించేందుకు మెటా ఇప్పుడు ఒక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది, దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వీక్షించవచ్చు.
వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఎలా చూడాలి?
1. మొదటగా, మీ ఫోన్‌లోని వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌గా అప్‌డేట్ చేసుకోవాలి.
2. వాట్సాప్ హోమ్ స్క్రీన్‌లో, 'Meta AI' సింబల్‌పై క్లిక్ చేయాలి.
3. Meta AI సింబల్‌పై క్లిక్ చేసిన తరువాత, ఒక చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
Details
ఈ నిబంధనలు పాటించాలి
4. ఆ చాట్ బాక్స్ కింద, టెక్స్ట్ ఇన్‌పుట్ బాక్స్ కనిపిస్తుంది.
5. ఇప్పుడు, 'షో మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్' అని టైప్ చేసి, సెండ్ చేయాలి.
6. కొన్ని క్షణాల్లో, మీ స్క్రీన్‌పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ప్రత్యక్షమవుతాయి.
7. రీల్స్‌పై క్లిక్ చేస్తే, అది నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీసుకెళ్తుంది.
Details
వ్యక్తిగత రీల్స్‌ను చూడడం ఎలా?
మీరు ఏదైనా ప్రత్యేక పేజీకి సంబంధించిన రీల్స్‌ను చూడాలనుకుంటే, 'Meta AI' చాట్ బాక్స్‌లో 'షో మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అని వ్యక్తి పేరు' టైప్ చేయాలి.
అప్పుడు మీరు కోరిన వ్యక్తి లేదా పేజీకి సంబంధించిన రీల్స్ మీ వాట్సాప్‌లో ప్రత్యక్షమవుతాయి. ఇంతవరకు ప్రారంభదశలో ఈ ఫీచర్ ఉంది. కానీ రాబోయే రోజుల్లో మెటా ఈ ఫీచర్‌ను మరింత విస్తరిస్తుందని సమాచారం.