Page Loader
15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే
15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే

15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే

వ్రాసిన వారు Stalin
Jun 17, 2023
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

15ఏళ్ల వయసులోనే అమెరికాలో ఓ స్టార్టప్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్న ఎరిక్ ఝూను ప్రముఖ వ్యాపార నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ నిషేదించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అసలు ఏమైందో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఎరిక్ ఝూను ప్రస్తుతం హైస్కూల్‌లో చదువుతున్నాడు. అతను ఓ స్టార్టప్‌ను నడుపుతున్నాడు. బాచ్‌మానిటీ క్యాపిటల్‌లో పెట్టుబడిదారుడిగా కూడా పనిచేస్తున్నాడు. చిన్న వయసులోనే వ్యాపారం మొదలు పెట్టి, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉన్న ఎరిక్‌ను లింక్డ్‌ఇన్ ఎందుకు బ్యాన్ చేసిందనేది ఇప్పుడు అందరి ప్రశ్న. వాస్తవానికి లింక్డ్‌ఇన్ ఖాతా ఉండాలంటే కనీసం 16ఏళ్ల వయసు ఉండాలి. కానీ ప్రస్తుతం ఎరిక్ వయసు 15ఏళ్లు మాత్రమే ఉండటంతో అతని ఖాతాను లింక్డ్‌ఇన్ నిలిపివేసింది.

 లింక్డ్‌ఇన్ 

వైరల్‌గా మారిన ఎరిక్ ఝూ పోస్ట్

ఎరిక్ ఝూ ఖాతాను పునరుద్ధరించాలంటే ఇంకో ఏడాది సమయం పడుతుందని లింక్డ్‌ఇన్ పేర్కొంది. తన లింక్డ్‌ఇన్ ఖాతా స్తంభించిపోవడంతో తన ఉద్యోగుల పెట్టిన మెసేజ్‌లకు స్పందించలేకపోతున్నారు. దీంతో కంపెనీ ఉద్యోగులు తనను అపార్థం చేసుకుంటున్నారని ఎరిక్ ఝూ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఓ ఉద్యోగి పెట్టిన పోస్టును ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ, తాను ఎందుకు రిప్లే ఇవ్వలేకపోతున్నానో వివరించే ప్రయత్నం చేశారు. తన వయసు 15 సంవత్సరాల వయస్సు ఉన్నందున లింక్డ్‌ఇన్ తనను నిషేధించిందని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కంపెన ఉద్యోగి పంపిన సందేశాన్ని స్క్రీన్ షాట్‌ తీసి పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఎరిక్ ఝూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారి, కామంట్లు, లైకులు పోటెత్తుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎరిక్ ఝూ చేసిన ట్వీట్

క్వాజీ

14 ఏళ్ల స్పేస్‌ఎక్స్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఖాతాను కూడా బ్లాక్ చేసిన లింక్డ్‌ఇన్ 

ఇటీవలే 14 ఏళ్ల బంగ్లాదేశ్-అమెరికన్ బాలుడు, ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కూడా లింక్డ్‌ఇన్ ఈ నెల 15వ తేదీన బ్లాక్ చేసింది. ఈ బాలుడి పేరు కైరాన్ క్వాజీ. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఉద్యోగాలను వెతకడానికి క్వాజీ చాలా తక్కువగా ఉందని లింక్డ్‌ఇన్ భావించింది. అందుకే అతని ప్రొఫైల్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయించుకుంది. లింక్డ్‌ఇన్ తన ప్రొఫైల్‌ను బ్లాక్ చేయడంపై క్వాజీ స్పందించారు. తనకు 16 ఏళ్లు లేని కారణంగా తన లింక్డ్‌ఇన్ ఖాతాను స్తంభింపజేసినట్లు క్వాజీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చెప్పాడు.