LOADING...
ISRO: రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌.. సీఎంఎస్-03 ఉపగ్రహం ప్రయోగానికి ఇస్రో సిద్ధం!
రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌.. సీఎంఎస్-03 ఉపగ్రహం ప్రయోగానికి ఇస్రో సిద్ధం!

ISRO: రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌.. సీఎంఎస్-03 ఉపగ్రహం ప్రయోగానికి ఇస్రో సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మిషన్‌ కోసం సన్నద్ధమైంది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లగల ఎల్‌వీఎం3-ఎం5 (LVM3-M5) రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా సీఎంఎస్‌-03 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం లక్ష్యంగా ఇస్రో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 3.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.

Details

ఇప్పటివరకూ ప్రయోగించిన ఉపగ్రహాలలో అత్యంత బరువైనది

ఇది మొత్తం 25 గంటలు 30 నిమిషాలు కొనసాగుతుంది. అనంతరం 4,400 కిలోల బరువున్న సీఎంఎస్‌-03 ఉపగ్రహాన్ని ఎల్‌వీఎం3 రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్తుంది. ప్రయోగం ప్రారంభమైన 16.09 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా స్థాపించనున్నారు శాస్త్రవేత్తలు. ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాలలో ఇది అత్యంత బరువైనది. అంటే 4,400 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి.