Page Loader
వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు
మార్క్ జుకర్‌బర్గ్ లాగా కనిపించే AI-జెనరేటెడ్ చిత్రం

వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Apr 01, 2023
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెటా సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లూయిస్ విట్టన్ దుస్తులను ధరించి ఫ్యాషన్ రన్‌వేలో నడుస్తున్నట్లు ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అతను సాధారణంగా ఎక్కువగా సాదా మోనోక్రోమటిక్ దుస్తులను ధరిస్తారు ఈ ఆకస్మిక మార్పు అందరినీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే, వాస్తవానికి అవి మిడ్‌జర్నీఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందాయి. ఆండ్రూ క్యూన్ గావో అనే ట్విటర్ వినియోగదారు, మార్క్ జుకర్‌బర్గ్ లాగా కనిపించే AI-జెనరేటెడ్ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ చిత్రాన్ని జూమ్ చేసిన తర్వాత, అది AI ఉపయోగించి తయారుచేసిన చిత్రం అని తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అయిన మార్క్ జూకర్ బర్గ్ AI చిత్రాలు