Meta Edits App: కంటెంట్ క్రియేటర్ల కోసం మెటా కొత్త క్రియేటివ్ సూట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచం మొత్తానికి షార్ట్ వీడియోల ట్రెండ్ ఈ మధ్యకాలంలో తెగ కలకలం రేపుతోంది.
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలో ఈ వీడియోలను ఎక్కువగా చూసే ఆదరణ పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో రీల్స్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఈ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని మెటా సంస్థ తాజా వీడియో ఎడిటింగ్ యాప్ 'ఎడిట్స్'ని విడుదల చేయాలని నిర్ణయించింది.
ఈ యాప్ ద్వారా బైట్‌డాన్స్‌కు చెందిన క్యాప్ కట్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి మెటా సిద్ధమైంది.
వివరాలు
క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేయడానికి కెమెరా సెట్టింగ్స్
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ప్రకారం, 'ఎడిట్స్' కేవలం ఒక సాధారణ వీడియో ఎడిటింగ్ యాప్ కాకుండా, ఇది క్రియేటర్ల కోసం ఒక సంపూర్ణ క్రియేటివ్ ప్యాకేజీని అందిస్తుందని పేర్కొన్నాడు.
ఈ యాప్‌లోని ఫీచర్లు నిజంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయని ఆయన చెప్పారు.
'ఎడిట్స్' యాప్‌లో ఉన్న విశేషమైన ఫీచర్లలో, క్రియేటర్లు తమ ఐడియాలను సేవ్ చేసుకునేందుకు ప్రత్యేక ట్యాబ్ ఉండనుంది.
అలాగే, మంచి క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేయడానికి కెమెరా సెట్టింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
వీడియోలను మరింత అందంగా మార్చేందుకు ఉచితంగా అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ టూల్స్‌ను అందించనున్నారు.
వివరాలు
'ఎడిట్స్' యాప్‌లో వాటర్‌మార్క్ లేని వీడియోలు
క్రియేటర్లు, ఫ్రెండ్స్ తమ డ్రాఫ్ట్‌లను ఒకదానితో మరొకటి షేర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలు ఎలా ప్లే అవుతాయో తెలుసుకొనేందుకు పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ టూల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఇది ఇలా ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు ఎడిట్ చేస్తే వాటర్ మార్క్‌లు వచ్చేస్తాయి.
కానీ 'ఎడిట్స్' యాప్‌లో వాటర్‌మార్క్ లేని వీడియోలను ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.
ఇది యూట్యూబ్ షార్ట్స్ వంటి వేర్వేరు ఫ్లాట్‌ఫారమ్స్‌లో వీడియోలు పోస్ట్ చేసే క్రియేటర్లకు చాలా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం, 'ఎడిట్స్' యాప్ ఐఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్ చేయడానికి యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.
వివరాలు
యాప్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్
త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఈ యాప్ విడుదల అవుతుంది. ఈ యాప్ పూర్తిగా ఉచితం. స్మార్ట్‌ఫోన్లలో వీడియోలను ఎడిట్ చేయడానికి అనుకూలంగా డిజైన్ చేయబడింది.
'ఎడిట్స్' యాప్‌లోని ప్రధాన ఫీచర్లను చూస్తే, 2K రిజల్యూషన్, 60fpsతో HDR, SDR ఫార్మాట్లలో వీడియోలు చేయడం, ప్రొఫెషనల్ వీడియోల కోసం ఆడియో, ఫిల్టర్స్‌ను లేయర్లుగా యాడ్ చేయడం వంటి అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి.
ఈ యాప్ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మొదట iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది, ఆ తరువాత ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది.
ప్రస్తుతం, యాప్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.