Meta Muse AI Calls: ఏఐ టెక్నాలజీలో మరో అడుగు.. మ్యూజ్‌తో బిజినెస్ కాల్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవాలన్నా, రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేయాలన్నా కొన్నిసార్లు విసుగొస్తుంది. ఫోన్ కలవకపోవడం, గంటల తరబడి వేచి ఉండటం చాలామందికి అనుభవమే. ఇలాంటి పనుల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మెటా తన ఏఐ అసిస్టెంట్ మ్యూజ్‌లో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై అమెరికాలోని వ్యాపార సంస్థలకు వినియోగదారుల తరఫున మ్యూజ్ నేరుగా ఫోన్ కాల్స్ చేయగలదు. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
Details
10 మిలియన్ల మంది వినియోగదారులు
సెప్టెంబర్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు మరింత మందికి అందుబాటులోకి తెచ్చింది.
గత నెల నాటికి మ్యూజ్‌కు 10 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నట్లు మెటా వెల్లడించింది.
కేబుల్ టీవీ సంస్థలకు ఫోన్ చేయడం, అమెరికాలోని DMV వంటి ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించడం, ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం లేని రెస్టారెంట్లలో రిజర్వేషన్ అడగడం వంటి పనులను ఏఐ చూసుకుంటుంది.
Details
నెలకు 20 డాలర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్
మ్యూజ్ సేవలు ప్రస్తుతం నెలకు 20 డాలర్లతో ప్రారంభమవుతున్నాయి.
ఈ ప్లాన్‌లో వారానికి 500 మిలియన్ టోకెన్లు లభిస్తాయి. ఎక్కువగా ఏఐ సేవలు ఉపయోగించేవారు నెలకు 100 డాలర్లు చెల్లించి 3 బిలియన్ టోకెన్ల ప్లాన్ తీసుకోవచ్చు.
Details
కస్టమర్ సర్వీసులో మారనున్న అనుభవం
గూగుల్ జెమిని, ఇన్‌స్టింక్ట్ వంటి ఏఐ సేవలు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి.
అయితే కొన్ని సంస్థలు ఏఐ కాల్స్ అని గుర్తించిన వెంటనే ఫోన్ పెట్టేస్తున్నాయి. అయినప్పటికీ మనిషి గొంతును పోలిన స్వరంతో మాట్లాడగలిగే ఏఐ అభివృద్ధి చెందుతోంది.
భవిష్యత్తులో కస్టమర్ తరఫున ఏఐ మాట్లాడుతోందని గుర్తించడం కూడా కష్టమవ్వొచ్చు.
మరోవైపు మ్యూజ్ ద్వారా ఈమెయిల్ అడ్రస్ సృష్టించుకునే సదుపాయాన్ని త్వరలో ఉచిత వినియోగదారులకు కూడా అందించనున్నట్లు మెటా వెల్లడించింది.