Loading...
Microsoft Rocket AI: మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం...సొంత ఏఐ మోడళ్ల డెవలప్‌మెంట్‌పై దృష్టి
మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం...సొంత ఏఐ మోడళ్ల డెవలప్‌మెంట్‌పై దృష్టి

Microsoft Rocket AI: మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం...సొంత ఏఐ మోడళ్ల డెవలప్‌మెంట్‌పై దృష్టి

వ్రాసిన వారు Balachander Sharma
Nov 24, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటివరకు ఇతర టెక్‌ సంస్థల ఏఐ మోడళ్లను ఉపయోగించుకుంటూ వచ్చిన మైక్రోసాఫ్ట్‌ ఇప్పుడు సొంతంగా మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దీనికోసం మైక్రోసాఫ్ట్‌ ఏఐ (MAI) ప్రత్యేకంగా Rocket అనే ఇన్‌హౌస్‌ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది. భారీ స్థాయిలో ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశం. వేల సంఖ్యలో GPUలను ఉపయోగించి వారాలు, నెలల పాటు కొనసాగే ట్రైనింగ్‌ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ వ్యవస్థను రూపొందించారు.

Details

హార్డ్‌వేర్‌ సమస్య వచ్చినా ట్రైనింగ్‌ ఆగదు

భారీ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం అంటే ఒక్కరోజు పని కాదు. వేల GPUలు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది.

ఇలాంటి సమయంలో ఒక్క హార్డ్‌వేర్‌ విఫలమైనా లేదా లెక్కల్లో చిన్న తేడా వచ్చినా మొత్తం ట్రైనింగ్‌ ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఇక్కడే Rocket వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొత్తం శిక్షణను మొదటి నుంచి ప్రారంభించకుండా అందుబాటులో ఉన్న వనరులను సర్దుబాటు చేసుకుంటూ ప్రక్రియను కొనసాగించేలా దీన్ని రూపొందించారు.

దీంతో సమయం, కంప్యూటింగ్‌ వనరులు, ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉంది.

Details

3 ట్రిలియన్‌ పారామీటర్ల MAI Base 2

మైక్రోసాఫ్ట్‌ తన సొంత MAI Base 2 బేస్‌ మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి Rocketను ఉపయోగిస్తోంది. ఈ మోడల్‌లో ఏకంగా 3 ట్రిలియన్‌ పారామీటర్లు ఉండనున్నాయి.

ముఖ్యంగా ఇతర థర్డ్‌ పార్టీ ఏఐ మోడళ్ల నుంచి సమాచారాన్ని తీసుకోకుండా, ప్రాథమిక స్థాయి నుంచి సొంతంగా మోడల్‌ను తీర్చిదిద్దుతున్నామని కంపెనీ చెబుతోంది.

అంటే భవిష్యత్తులో ఏఐ మోడళ్ల విషయంలో ఇతర సంస్థలపై ఆధారపడకుండా తన సొంత సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నది మైక్రోసాఫ్ట్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT

Details

Claude, GPTలకు పోటీగా మైక్రోసాఫ్ట్‌ ఏఐ

Rocketతో శిక్షణ పొందుతున్న ఏఐ మోడళ్లు ఇప్పటికే పలు పబ్లిక్‌, ప్రైవేట్‌ రీజనింగ్‌ బెంచ్‌మార్క్‌లలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని మైక్రోసాఫ్ట్‌ ఏఐ వెల్లడించింది.

తమ మోడల్‌ ఆంత్రోపిక్‌ Claude Opus 4.8ను అధిగమించిందని, త్వరలో GPT-5.6 Solను కూడా దాటే దిశగా ఉందని కంపెనీ పేర్కొంది.

సొంత మోడళ్లతో పాటు అవసరమైన చోట ఇతర సంస్థల మోడళ్లను కూడా ఉపయోగించుకుంటామని సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు.

చివరికి వినియోగదారులకు తక్కువ ఖర్చుతో మెరుగైన ఏఐ సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT