Skype: 22ఏళ్ల తర్వాత స్కైప్ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) తన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్ (Skype) సేవలకు శాశ్వతంగా ముగింపు పలకేందుకు సిద్ధమైంది.
త్వరలోనే ఈ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని ఎక్స్‌డీఏ(XDA) తన తాజా నివేదికలో వెల్లడించింది. స్కైప్ 2003లో వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలను ప్రారంభించింది.
2011లో మైక్రోసాఫ్ట్ ఈ సేవలను కొనుగోలు చేసింది. ఆ విధంగా మొత్తం 22 సంవత్సరాల పాటు స్కైప్ వినియోగదారులకు సేవలందించింది.
వివరాలు
మే నెల నుంచి ఈ సేవలు నిలిపివేత
అయితే, 2017లో మైక్రోసాఫ్ట్ "టీమ్స్" (Teams) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినప్పటి నుంచి, స్కైప్‌కు అంతర్గతంగా పోటీ పెరిగింది.
దీని ప్రభావంతో, స్కైప్ పాపులారిటీ క్రమంగా తగ్గిపోసాగింది. దీంతో, స్కైప్ సేవలు ఎప్పుడైనా నిలిపివేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు స్కైప్‌కు గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించుకుంది.
మే నెల నుంచి ఈ సేవలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు స్కైప్ వాడుతున్న వినియోగదారులు ఇకపై "టీమ్స్"లోకి మారాల్సి ఉంటుంది, అక్కడ నుంచే కాల్స్, చాటింగ్ కొనసాగించవచ్చు.