మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా
మోటోరోలా Moto E13 ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో పాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Moto E13 సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ముందు భాగంలో 5MP లెన్స్ తో వస్తుంది. Moto E13 బేస్ వేరియంట్ 2GB RAM, 64GB స్టోరేజ్ ధర Rs.6,999 ఉంటే, 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ ధర Rs.7,999. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ నుండి కొనుక్కోవచ్చు.
జియో కస్టమర్‌లు జియో లాక్ ఆఫర్‌ని ఎంచుకోవడం ద్వారా Rs.700 క్యాష్‌బ్యాక్ పొందచ్చు
ఈ స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్స్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఉన్న లేదా కొత్త జియో కస్టమర్‌లు జియో లాక్ ఆఫర్‌ని ఎంచుకోవడం ద్వారా Rs.700 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. Moto E13 అనే డ్యూయల్ సిమ్ (నానో) 4G ఫోన్, 4GB LPDDR4x RAM, 64GB మైక్రో SD కార్డ్ (1TB వరకు) స్టోరేజ్ తో వస్తుంది. 10W ఛార్జింగ్ తో 5,000mAh బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ IP52-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ డిజైన్ తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.0 వైర్‌లెస్ కనెక్టివిటీతో పాటు 2.4GHz, 5GHz డ్యూయల్-బ్యాండ్ Wi-Fi సపోర్ట్ చేస్తుంది.