Motorola: సోషల్ మీడియా,క్రియేటర్లపై మోటరోలా కేసు.. ఫేక్ కంటెంట్‌పై చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మోటరోలా ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, కంటెంట్ క్రియేటర్లపై కోర్టు మెట్లు ఎక్కింది. బెంగళూరు కోర్టులో దాఖలైన ఈ కేసులో కంపెనీ డివైసులపై తప్పుడు, ఫేక్ కంటెంట్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఈ కేసులో X, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫార్మ్స్‌తో పాటు పలువురు క్రియేటర్లు కూడా ఉన్నారు. 60 పేజీలకు పైగా ఉన్న ఈ పిటిషన్‌లో తప్పుడు రివ్యూలు, వీడియోలు, కామెంట్లు, బహిష్కరణ క్యాంపెయిన్లను నిలిపివేయాలని కోర్టును కోరింది.
వివరాలు
భారత్‌లో మోటరోలాకు పెద్ద మార్కెట్
ఫోన్లు పేలుతున్నాయనే పోస్టులు సహా వందల సంఖ్యలో కంటెంట్‌ను మోటరోలా ప్రస్తావించింది. కొందరు క్రియేటర్లు ఈ కేసు గురించి X నుంచి మెయిల్ వచ్చిన తర్వాతే తెలుసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే, భారత్‌లో మోటరోలాకు పెద్ద మార్కెట్ ఉండటంతో ఈ కేసు ప్రభావం పెద్దగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో తప్పుడు సమాచారం ప్రచారం చేయకూడదని కొందరు ఇండస్ట్రీ నేతలు మద్దతు తెలపగా, విమర్శలు ఎదురైతే మెరుగులు దిద్దుకోవాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.