LOADING...
Nano Banana Pro: నకిలీ ఆధార్,పాన్ కార్డులను క్రియేట్ చేస్తున్న నానో బనానా ప్రో.. గూగుల్ పై కొత్త ప్రశ్నలు 
గూగుల్ పై కొత్త ప్రశ్నలు

Nano Banana Pro: నకిలీ ఆధార్,పాన్ కార్డులను క్రియేట్ చేస్తున్న నానో బనానా ప్రో.. గూగుల్ పై కొత్త ప్రశ్నలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తాజాగా విడుదల చేసిన Gemini Nano Banana Pro మోడల్ గత వారం నుంచి సోష‌ల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ మోడల్‌లో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెరుగ్గా ఉండటం, 4K క్వాలిటీలో ఇమేజ్ జనరేషన్ & ఎడిటింగ్ రావటం, అలాగే Google Search ఇంటిగ్రేషన్ ఉండటం వంటివి యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. మోడల్ లాంచ్ అయిన తర్వాత యూజర్లు దీన్ని ర‌క‌ర‌కాల రియ‌ల్‌లైఫ్ యూజ్ కేసుల కోసం ట్రై చేస్తూ—స్టైలిష్ పోర్ట్రెయిట్లు క్రియేట్ చేయటం, LinkedIn ప్రొఫైల్స్‌ను AI ఇన్‌ఫోగ్రాఫిక్స్‌గా మార్చటం, కాంప్లెక్స్ టెక్స్ట్‌ను వైట్‌బోర్డ్ స్టైల్ సమ్మరీలుగా విజువలైజ్ చేయటం—లాంటివి చేస్తున్నారు.

వివరాలు 

Nano Banana Pro జన‌రేట్ చేసిన చిత్రాలపై Gemini వాటర్‌మార్క్

కానీ మరో వైపు, కొంతమంది యూజర్ల అభిప్రాయం ప్రకారం Nano Banana Pro దుర్వినియోగానికి కూడా దారితీయొచ్చు. ముఖ్యంగా, దీని రియలిస్టిక్ ఇమేజ్ జనరేషన్ వల్ల ఆధార్, PAN వంటి భారతీయ గుర్తింపు పత్రాలను కూడా నకిలీగా తయారు చేసే అవకాశాలు ఉన్నాయని..ఇది నిజ జీవితంలో ప్రైవసీకి పెద్ద ముప్పు కావచ్చని వారు చెబుతున్నారు. గూగుల్ తన Nano Banana Pro జన‌రేట్ చేసిన చిత్రాలపై Gemini వాటర్‌మార్క్ను, అలాగే గుర్తించడానికి వీలైన SynthID ఇన్‌విజిబుల్ వాటర్‌మార్కింగ్ను జత చేస్తోంది. కానీ ఇవి తొలగించడం పెద్ద కష్టం కాదు. అందువల్ల ఇటువంటి నకిలీ IDs, ప్రింట్ చేసి లేక త్వరగా చూపించినప్పుడు, నిజమైనవి అని పొరబాటుకు గురయ్యే అవకాశముంది.

వివరాలు 

ఈ మోడల్ రియలిస్టిక్ ఇమేజ్‌లను సృష్టించడంలో ChatGPT కంటే అనేక రెట్లు శక్తివంతం

గూగుల్ మోడళ్లలో ఇప్పటికే చాలా కఠినమైన సేఫ్టీ గార్డ్‌రైల్స్ ఉన్నాయని యూజర్లు తరచూ విమర్శిస్తుంటారు. అలా ఉండగా, ఇలాంటి ప్రాథమిక దుర్వినియోగం ఎలా మిస్ అయ్యిందో అనేది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా, మోడల్ ఇతర సందర్భాల్లో "sexually suggestive", "violence", "sensitive content" అంటూ చాలా అభ్యర్థనలను తిరస్కరిస్తూనే వచ్చింది. ఇది ఇలా జరగడం మొదటిసారి కాదు. ChatGPT (GPT-4o) సమయంలో కూడా యూజర్లు అడిగినప్పుడు నిజ‌మైనట్టే కనిపించే PAN, ఆధార్ కార్డులు మోడల్ జనరేట్ చేసింది. అయితే, Nano Banana Pro విషయంలో సమస్య మరింత పెరిగింది, ఎందుకంటే ఈ మోడల్ రియలిస్టిక్ ఇమేజ్‌లను సృష్టించడంలో ChatGPT కంటే అనేక రెట్లు శక్తివంతంగా ఉంది.