Page Loader
NASA : లేజర్‌ కమ్యూనికేషన్‌లో కీలక మైలురాయి.. అంతరిక్షం నుంచి తొలిసారి వీడియో ప్రసారం చేసిన నాసా
అంతరిక్షం నుంచి తొలిసారి వీడియో ప్రసారం చేసిన నాసా

NASA : లేజర్‌ కమ్యూనికేషన్‌లో కీలక మైలురాయి.. అంతరిక్షం నుంచి తొలిసారి వీడియో ప్రసారం చేసిన నాసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 19, 2023
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

లేజర్‌ కమ్యూనికేషన్‌ రంగంలో నాసా(అమెరికా అంతరిక్ష కేంద్రం) కీలక పురోగతి సాధించింది. ఈ మేరకు సాయంతో అంతరిక్షం నుంచి తొలిసారి వీడియోను ప్రసారం చేసింది. ఫలితంగా మిలియన్‌ మైళ్ల దూరం నుంచి బ్రాడ్‌ బ్యాండ్ వీడియోలను ప్రసారం చేయాలన్న లక్ష్యం నెరవేరిందని నాసా వెల్లడించింది. లేజర్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ ద్వారా అంతరిక్షం నుంచి తొలి అల్ట్రా హెచ్‌డీ వీడియోను భూమికి పంపింది. సుమారు 31 మిలియన్‌ కిలోమీటర్ల దూరం నుంచి ఈ వీడియో ప్రసారం కావడం విశేషం. భూమి, చంద్రుడి మధ్య దూరం కంటే 80 రెట్లు ఎక్కువ. 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అంతరిక్షంలోని వ్యోమనౌకలో ఉన్న టాటర్స్ అనే పిల్లి లేజర్‌ లైట్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.

DETAILS

 డీప్‌ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్ ప్రయోగంలో భాగంగానే...

డీప్‌ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్ ప్రయోగం (DSOC)లో భాగంగా ఈ వీడియోను సోమవారం ప్రసారం చేసినట్లు నాసా ట్వీట్ చేసింది. ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో అంతరిక్షం నుంచి భూమి మీదకు డేటా, ఫొటో/వీడియోలను పంపించేందుకు, మానవుల అంగారక యాత్రకు ఉపకరిస్తుందని వివరించింది. అంతరిక్షంలో అంగారక-గురు గ్రహాల మధ్య ఉంటూ సూర్యుని కక్ష్యలో తిరుగుతున్న గ్రహశకలంపైకి గత అక్టోబరులో నాసా 'సైకీ' అనే వ్యోమనౌకను పంపింది. కొద్ది రోజుల క్రితం ట్రాన్సీవర్‌ భూమి మీదకు విజయవంతంగా లేజర్‌ సంకేతాన్ని పంపించింది. అక్కడ వీడియోను డీకోడ్‌ అయినట్లు జేపీఎల్ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బిల్ క్లిప్‌స్టెయిన్‌ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మరో మైలురాయి చేరుకున్న అమెరికా నాసా