
PolSIR మిషన్‌ను అమోదించిన నాసా.. దానివల్ల ప్రయోజనం ఏంటీ?
ఈ వార్తాకథనం ఏంటి
భూమిలో వాతావరణాన్ని, డైనమిక్ స్వభావాన్ని తెలుసుకోవడానికి నాసా కొత్త మిషన్ ను అమోదించింది.
PolSIR (పోలరైజ్డ్ సబ్‌మిల్లిమీటర్ ఐస్-క్లౌడ్ రేడియోమీటర్) అని పిలువబడే ఈ మిషన్ మంచు మేఘాలపై పరిశీలన చేయడానికి, భూమి స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడనుంది.
మంచు మేఘాల వల్ల వాతావరణంపై కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపుతాయి. సమశీతోష్ణ ప్రాంతాలలో 5.5 కిలోమీటర్ల ఎత్తులో, ఉష్ణమండల ప్రాంతాలలో 6.5 కిమీ ఎత్తులో ఈ మంచు మేఘాలు ఏర్పడతాయి.
తద్వారా ప్రపంచ వాతావరణంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచు మేఘాలు వాతావరణంలో చిన్న కణాలతో ప్రారంభమవుతాయని నాసా వివరించింది.
Details
మంచు మేఘాలను పర్యవేక్షనున్న PolSIR
PolSIR ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో అధిక ఎత్తులో ఏర్పడే మంచు మేఘాలను పర్యవేక్షిస్తుంది. ఈ మిషన్ రెండు ఒకేలాంటి క్యూబ్‌శాట్‌లను కలిగి ఉంటుంది, ఒక్కో ఉపగ్రహం ఎత్తు 12 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటుంది.
ఈ ఉపగ్రహాలు వాతావరణంలో మంచు మేఘాల మందం, పరిమాణాన్ని తెలియజేస్తుందని పరిశోధకుడు బెన్నార్ట్జ్ చెప్పారు.
మంచు మేఘాలు వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో కచ్చితమైన అంచనాలను రూపొందించడంలో ఈ మిషన్ సహాయపడుతుంది.
PolSIR మిషన్ ఎప్పుడు ప్రారంభిస్తారో అనే దానిపై నాసా ఇంకా స్పష్టత లేదు.