అంగారక గ్రహంపై సూర్యోదయం ఎలా ఉంటుందో తెలుసా? క్యూరియాసిటీ రోవర్ తీసిన ఫోటోలు చూడండి
అంగారక గ్రహం మీద జీవం ఉందేమో కనుక్కునేందుకు క్యూరియాసిటీ రోవర్ ను నాసా పంపింది. ఈ రోవర్, ప్రస్తుతం అంగార గ్రహం మీద సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు, ఎలా అస్తమిస్తున్నాడో ఫోటోలు తీసి పంపింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది నాసా. అంగారక కాలమానం ప్రకారం ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 9:30గంటలకు సూర్యోదయాన్ని, రాత్రి 3:40గంటలకు సూర్యాస్తమాన్ని కలిపి పనోరమిక్ వ్యూలో ఫోటోలు తీసి పంపింది. అంగారక గ్రహం మీద గేల్ క్రేటర్ అనే పర్వతం మీద ఈ ఫోటోలను క్యూరియాసిటీ రోవర్ తీసిందట. ఈ పర్వతం 5కిలోమీటర్ల ఎత్తు ఉంటుందట. క్యూరియాసిటీ పంపిన ఫోటో సూర్యోదయం, సూర్యాస్తమయం ఫోటోలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.