జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిన్న మెయిన్-బెల్ట్ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST)ని ఉపయోగించి, యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం మార్స్, బృహస్పతి మధ్య ప్రధాన బెల్ట్‌లో ఒక గ్రహశకలాన్ని గుర్తించింది. 300 నుండి 650 అడుగుల పొడవున్న ఈ గ్రహశకలం, అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా కనుగొన్న అతి చిన్న వస్తువు. ఈ ప్రధాన ఆస్టరాయిడ్ బెల్ట్ సౌర వ్యవస్థలోని గ్రహశకలాలు ఉన్న డోనట్ ఆకారపు ప్రాంతం. ఇది దాదాపుగా మార్స్ మరియు బృహస్పతి కక్ష్యల మధ్య ఉంది. వెబ్ లో ఆన్‌బోర్డ్ మిడ్-ఇన్‌ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్ (MIRI) ఉపయోగించిన డేటా నుండి గ్రహశకలం కనుగొన్నారు.
గ్రహశకలం స్వభావం, లక్షణాల కోసం తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం
అంగారక గ్రహం, బృహస్పతి మధ్య ఉన్న ప్రధాన గ్రహశకలం బెల్ట్‌లో ఒక కిలోమీటరు కంటే తక్కువ పొడవు ఉన్నగ్రహశకలం స్వభావం, లక్షణాల కోసం తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం. మరిన్ని అధ్యయనాల చేయడం వలన సౌర వ్యవస్థ నిర్మాణం, పరిణామంపై అవగాహన పెరుగుతుంది. అయితే ఇలాంటి చిన్న గ్రహశకలాల పై అధ్యయనాలు చాలా తక్కువ జరిగాయి, కారణం వాటిని కనిపెట్టుకుంటూ ఉండడం కష్టం. . వెబ్ అద్భుతమైన పనితీరుతో సుమారు 100 మీటర్ల వస్తువును 100 మిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో నుండి చూడటం సాధ్యం చేసింది అని నాసా తెలిపింది.