NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / NASA: చంద్రుడిపై రైల్వే స్టేషన్‌ నిర్మించాలన్న యోచనలో NASA.. ప్రణాళికలు రెడీ 
    తదుపరి వార్తా కథనం
    NASA: చంద్రుడిపై రైల్వే స్టేషన్‌ నిర్మించాలన్న యోచనలో NASA.. ప్రణాళికలు రెడీ 
    చంద్రుడిపై రైల్వే స్టేషన్‌ నిర్మించాలన్న యోచనలో NASA.. ప్రణాళికలు రెడీ

    NASA: చంద్రుడిపై రైల్వే స్టేషన్‌ నిర్మించాలన్న యోచనలో NASA.. ప్రణాళికలు రెడీ 

    వ్రాసిన వారు Stalin
    May 14, 2024
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రునిపై ఉపరితలం అంతటా సమర్థవంతగా, స్వయంప్రతిపత్తమైన, సమర్థవంతమైన పేలోడ్ రవాణా చేయడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మొదటి చంద్ర రైల్వే వ్యవస్థను నిర్మించడానికి తన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    జాబిల్లి పై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని యోచిస్తోంది.

    ఇందుకోసం చంద్రుడిపై అన్వేషణలను మరింత విస్తరించడం, అక్కడి ఉపరితలంపై క్రియాశీలక స్థావరాలను ఏర్పాటు చేయడం నాసా ప్రధాన లక్ష్యాలుగా ఏర్పర్చుకుంది.

    Details 

    ఫ్లోట్ అంటే ఏంటి? 

    రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు 'ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ (ఫ్లోట్)' అనే ప్రత్యేక వ్యవస్థను నాసా ప్రతిపాదించింది.

    FLOAT సిస్టమ్ 3-లేయర్ ఫ్లెక్సిబుల్ ఫిల్మ్ ట్రాక్‌పైకి వెళ్లే శక్తి లేని మాగ్నెటిక్ రోబోట్‌లను ఉపయోగిస్తుంది.

    ఈ ట్రాక్‌లో డయామాగ్నెటిక్ లెవిటేషన్‌ని ఉపయోగించి పాసివ్ ఫ్లోటింగ్ కోసం గ్రాఫైట్ లేయర్, ట్రాక్‌ల వెంట రోబోట్‌లను నడపడానికి విద్యుదయస్కాంత థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయడానికి ఫ్లెక్స్-సర్క్యూట్ లేయర్, సూర్యరశ్మికి గురైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి కోసం ఐచ్ఛిక సన్నని-ఫిల్మ్ సోలార్ ప్యానెల్ లేయర్ ఉన్నాయి.

    సాధారణంగా రైళ్ల వ్యవస్థలో తలెత్తే చక్రాలు,ట్రాకుల సవాళ్లను అధిగమించడంలో 'మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ' ఉపయోగపడుతుంది.

    Details 

    చంద్రుడిపై స్థావర కార్యకలాపాలను సులభతరం చేయగలదని అంచనా

    ట్రాక్‌పై చంద్రుడి దుమ్ము ధూళి రాపిడిని తగ్గించడానికి ఫ్లోట్ రోబో‌లను ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చేస్తారు.

    ట్రాక్‌ను రైళ్లు తాకకుండా ఈ రోబో‌లు కంట్రోల్ చేస్తాయి . దానివల్ల రైళ్లు సజావుగా తేలుతూప్రయాణిస్తాయి.

    ఫ్లోట్ వ్యవస్థ ప్రతి సెకన్‌కు 0.5 మీటర్ల వేగంతో భిన్న ఆకృతుల పేలోడ్‌లను రవాణా చేయగలదని నాసా తెలిపింది.

    ఒక హెవీ ఫ్లోట్ వ్యవస్థ రోజుకు 1,00,000 కిలోల పేలోడ్‌ను ఎన్నో కిలోమీటర్లకు పైగా దూరం తరలించగలదని ఆశాభావం వ్యక్తం చేసింది.

    చంద్రుడిపై స్థావర కార్యకలాపాలను సులభతరం చేయగలదని అంచనా వేసింది.

    చంద్రుడిపై ఈ నూతన రవాణా పరిష్కారం భూమికి వెలుపల మానవ అన్వేషణ, ఆవాసాల అభివృద్ధిలో గణనీయమైన ముందడుగు అని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాసా

    తాజా

    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే హైదరాబాద్
    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు

    నాసా

    సూర్యుని నుండి భారీ ముక్క విరగడంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు సూర్యుడు
    చంద్రుడు ధూళితో సౌర ఘటాలను తయారు చేయనున్న జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ చంద్రుడు
    నాసాకు చెందిన రోవర్ మిషన్ నిర్మించిన శాంపిల్ డిపో గురించి తెలుసుకుందాం పరిశోధన
    అంగాకరుడిపై రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న నాసా రోవర్ మిషన్ గ్రహం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025