LOADING...
NASA : ఆకాశంలో అద్భుత చిత్రాన్ని తీసిన నాసా.. చూస్తే మైమరిచిపోవాల్సిందే!
ఆకాశంలో అద్భుత చిత్రాన్ని తీసిన నాసా.. చూస్తే మైమరిచిపోవాల్సిందే!

NASA : ఆకాశంలో అద్భుత చిత్రాన్ని తీసిన నాసా.. చూస్తే మైమరిచిపోవాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆకాశంలో కనిపించే సన్నని తీగల వంటి ఆకారాలను ఫిలమెంట్స్‌ అని పిలుస్తారు. తాజా చిత్రాల్లో సెర్పెన్ సౌత్‌ స్టార్‌ క్లస్టర్‌లో దాదాపు 600 నక్షత్రాలతో నిండిన ప్రాంతం చూపిస్తుంది. ఈ చిత్రాన్ని నాసా SOFIA ప్రాజెక్టు భాగంగా విమానం నుంచి టెలిస్కోప్‌ ఉపయోగించి తీసుకున్నారు. ఇవి పర్వతాలు కాదు. కారినా నెబ్యులా ప్రాంతంలోని NGC 3324లో వాయువులతో నిండిన ప్రాంతంలో ఈ ఫిలమెంట్స్‌ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొత్త నక్షత్రాలు జన్మిస్తుంటాయి. జేమ్స్ వెబ్‌ టెలిస్కోప్‌ కూడా ఈ అద్భుత దృశ్యాన్ని తన కళ్లతో పట్టుకుంది. కారినా నెబ్యులాలోని అత్యంత కాంతివంతమైన నక్షత్రం ఏజీ కారినై. పొడవుగా వేళ్లలా కనిపించే ఆకారాలను స్పష్టంగా చూపించింది.ఈ ఆకారాల ఎత్తు సుమారు 5 కాంతి సంవత్సరాలపాటు విస్తరించింది.

Details

కీహోల్‌ ప్రాంతంలో అయస్కాంత క్షేత్రం చిత్రీకరణ

క్రాబ్‌ నెబ్యులా భాగం కూడా వివిధ టెలిస్కోప్‌లతో చిత్రీకరించారు. నీలి, తెలుపు రంగులను నాసా చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటర్‌, ఊదా రంగును హబుల్‌ టెలిస్కోప్‌, పింక్‌ కలర్‌లోని ఇన్‌ఫ్రారెడ్ డేటాను స్పిట్జర్‌ టెలిస్కోప్‌ తీసింది. SOFIA ప్రాజెక్టులోని లాసిల్లా ద్వారా కారినా నెబ్యులా కీహోల్‌ ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రం చిత్రీకరించారు. దీపావళినాడు ఆకాశంలో మెరిసేలా కనిపించే ఈ చిత్రం యువ నక్షత్రాల కూటమైన వెస్టర్‌లండ్‌ 2కు చెందినది. ఇక్కడ సుమారు 3,000 నక్షత్రాలు ఉన్నాయి. హబుల్‌ టెలిస్కోప్‌ ఈ అద్భుత కూటమిని క్లిక్‌ చేసింది. అలాగే, మండుతున్న అగ్ని గోళంలా కనిపించే 'కాసియోపియా ఏ' సూపర్‌నోవా కూడా నాసా చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ద్వారా చిత్రీకరించారు.