ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్
ఆపిల్ వాచ్ సిరీస్ కు GPS కనెక్టివిటీకు ఇప్పుడు ఐఫోన్ అవసరం లేదు. 2022 నుండి ఆపిల్ వాచ్ ఒక ప్రధాన అప్‌డేట్‌ను పొందింది. ఇప్పుడు ఐఫోన్ దగ్గర ఉన్నా సరే ఆపిల్ వాచ్ తన సొంత GPS ను వాడుతుంది. ఇంతకు ముందు ఆపిల్ వాచ్ ప్రాసెసింగ్ కోసం సమీపంలోని ఆపిల్ వాచ్ పై ఆధారపడేది. సెల్యులార్ కనెక్టివిటీని అందించే మొదటి ఆపిల్ వాచ్ 2017లో వాచ్ సిరీస్ 3 ప్రారంభించడంతో సమీపంలోని ఐఫోన్ అవసరం లేకుండా వాచ్ ద్వారా కాల్ చేసే ఫీచర్ ను అందించింది. 2016లో ఆపిల్ వాచ్ సిరీస్ 2కు స్వంత GPS సిస్టమ్ వచ్చింది. అయితే GPS కోసం మాత్రం ఐఫోన్ మీద ఆధారపడి ఉండేది.
వ్యాయమ సమయంలో లొకేషన్ ట్రాక్ కు సహాయపడుతుంది
తాజా మూడు మోడళ్లలో ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ అల్ట్రా, వాచ్ SE 2 ఇప్పుడు ఫోన్ సమీపంలోని ఉన్నా వాటి స్వంత GPSను ఉపయోగిస్తాయి. ఐఫోన్ అవసరం లేకుండా ఈ ఇన్-బిల్ట్ GPS వ్యాయమ సమయంలో లొకేషన్‌ను ట్రాక్ చేయడం సులభం చేస్తుంది. అవుట్‌డోర్ వాక్, రన్ వర్కవుట్‌ల విషయంలో, దూరాన్ని కొలిచేందుకు, మ్యాపింగ్ కు ఉపయోగపడుతుంది. తాజా అప్డేట్ GPSతో ఉన్న పాత ఆపిల్ వాచ్ మోడల్‌లకు వర్తించదు, సరికొత్త మోడల్‌లకు మాత్రమే. ఈ సరికొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 8 ధర రూ. 31800 కాగా, వాచ్ SE 2 రూ. 19800, ఇక అన్నిటికన్నా ఖరీదు ఆపిల్ వాచ్ అల్ట్రా రూ. 63,700.