
మార్కెట్లోకి కొత్త ASUS Windows 11.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మొబైల్ ఫోన్ గేమర్లను మరింత ఆకట్టుకునేందుకు మార్కెట్లోకి మరో సరికొత్త మొబైల్ గేమ్ ఫోన్ వచ్చేసింది.
Asus ప్రపంచ వ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుతం ASUS Windows 11 మొబైల్ గేమింగ్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ. రూ. 69,990 ఉండనుంది.
ఈ మొబైల్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్, అధికారిక ఈ-స్టోర్ లో అందుబాటులో లభించనుంది. కన్సోల్ AMD Radeon గ్రాఫిక్స్‌తో 120Hz ఫుల్-HD డిస్ ప్లే, AMD రైజెన్ Z1 ప్రాసెసర్ తో ఈ మొబైల్‌ను ఆకర్షణీయంగా రూపొందించారు.
చాలా ఏళ్ల తర్వాత ASUS ROG Ally ఎట్టకేలకు ఇండియాలోకి ప్రవేశపెట్టింది. హై-ఎండ్ ఫీచర్‌లతో కొత్త హ్యాండ్‌హెల్డ్ కన్సోల్ అద్భుతమైన గేమింగ్‌ను అందిస్తుందని సంస్థ వెల్లడించింది.
Details
200 మంది కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్
Asus ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే Asus ROG Phone7, మరొకటి ROG ఫోన్ 7 అల్టిమేట్ అనే రెండు గేమింగ్ ఫోన్‌లను విడుదల చేసింది.
ASUS ROG Ally ధర రూ. 69,990 ఉండగా. దీన్ని ఫ్లిప్‌కార్ట్, ASUS స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
జూలై 12-15 మధ్య ASUS ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల ద్వారా కన్సోల్‌ను కొనుగోలు చేసిన మొదటి 200 మంది కస్టమర్లకు ఆఫర్ ను ప్రకటించింది.
ROG Allyలో AMD Radeon గ్రాఫిక్స్‌తో కూడిన AMD రైజెన్ Z1 చిప్‌సెట్‌ను అమర్చారు.
గేమింగ్ కన్సోల్ Windows 11లో రానుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 40Wh బ్యాటరీతో ప్రత్యేకంగా వస్తోంది.